కృష్ణానది పైప్‌లైన్‌లో భారీ లీకేజీ.. ఆ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం

కృష్ణానది(Krishna River) తాగునీటి సరఫరా ఫేజ్-1లోని పైప్‌లైన్‌లో భారీ లీకేజీ ఏర్పడింది.

Update: 2024-09-19 11:49 GMT

దిశ, వెబ్‌డెస్క్:కృష్ణానది(Krishna River) తాగునీటి సరఫరా ఫేజ్-1లోని పైప్‌లైన్‌లో భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌లోని(Hyderabad) పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు నేడు(గురువారం) అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. దేవత్‌పల్లి(Devatpalli) వద్ద 300 ఎంఎం డయా ఎయిర్ వాల్వ్‌లో ఆకస్మికంగా భారీగా లీకేజీ కనిపించిందని పేర్కొన్నారు.

ఈ కారణంగానే తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని జలమండలి ఎండీ(Jalmandal MD) అశోక్ రెడ్డి వెల్లడించారు. ఈ లీకేజీ మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఇవాళ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ లీకేజీ కారణంగా మిరాలం, సైదాబాద్, నారాయణగూడ, కిషన్ బాగ్, సంతోష్ నగర్, యాకుత్‌పురా, చంచల్‌గూడ, బొగ్గులకుంట, అడిక్‌మెట్, నల్లకుంట, శివం రోడ్డు, చిలకలగూడ, దిల్‌సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పాక్షిక అంతరాయం కలుగుతుందని తెలిపారు.


Similar News