Madanapalle: సబ్ కలెక్టర్ ఆఫీసులో కీలక ఫైళ్లు దగ్ధం.. అత్యవసర విచారణకు ఆదేశం

అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది...

Update: 2024-07-22 05:18 GMT

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయి. కాసేపట్లో కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో ఘటన జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయింది. అగ్ని ప్రమాదమేనా.. కుట్ర పూరితామేనా అనే కోణంలో విచారణకు ఆదేశించింది. హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి డీజీపీ బయల్దేరారు. భూములకు సంబంధించిన ఫైళ్లు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News