తండ్రి కాదు కామాంధుడు: కన్న కూతురిని గ్రామ శివార్లోకి తీసుకెళ్లి ఘోరం
నవమాసాలు కష్టపడి తల్లి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డ ప్రయోజకుడయ్యే వరకు అన్నీ తానవుతాడు తండ్రి.
దిశ, డైనమిక్ బ్యూరో : నవమాసాలు కష్టపడి తల్లి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డ ప్రయోజకుడయ్యే వరకు అన్నీ తానవుతాడు తండ్రి. పిల్లలను ప్రయోజకులుగా చేయడం తన బాధ్యత అని కష్టపడతాడు. ముఖ్యంగా కుమార్తె తండ్రి మధ్య ఉండే అనుబంధం వేరు. దాదాపు ప్రతీ కూతురు తండ్రిని అమితంగా ప్రేమిస్తుంది. అంతే ప్రేమతో తండ్రి కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. కానీ ఓ కామాంధుడు అందుకు భిన్నంగా వ్యవహరించాడు. కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడి గాయపరిచాడు. గత నెలలో జరిగిన ఈ అమానుష ఘటన అనకాపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి రూరల్ ఎస్ఐ నర్సింగరావు తెలిపిన వివరా ప్రకారం అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో ఓ కుటుంబం నివశిస్తోంది.కన్న కూతురిపట్ల తండ్రి మృగంలా మారాడు. జూలై 30న భార్య ఇంట్లో లేని సమయంలో కుమార్తెను అనుభవించాలని ప్రయత్నించాడు. పక్కా ప్లాన్ ప్రకారం కుమార్తెను నేరేడు పళ్లు కొనిస్తానని కోడూరు గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. నిర్మానుష్యమైన ప్రాంతంలో కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడి గాయపరిచాడు. అనంతరం ఈ విషయాన్ని అమ్మకు లేదా ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక ఎవరికీ చెప్పకుండా తీవ్ర మనోవేదనకు గురైంది.
బయటపడిందిలా..!
గత కొన్ని రోజులుగా కుమార్తె ప్రవర్తనలో మార్పును తల్లి గమనించింది. తండ్రిని చూస్తుంటే కూతురు బెంబేలెత్తిపోవడం గమనించింది. అంతేకాదు మానసికంగా ఏదో కోల్పోయినట్లు ప్రవర్తించడంతో అనుమానంతో తల్లి అక్కున చేర్చుకుని ఆరా తీసింది. అయితే ఈనెల 13న తన పట్ల తండ్రి చేసిన పాడుపని గురించి తల్లికి చెప్పి విలపించింది. రక్తం పంచుకుని పుట్టిన కుమార్తె పట్ల భర్త ప్రవర్తించిన తీరును తట్టుకోలేకపోయింది. బంధువులకుతెలియజేసి విలపించింది. పంచాయతీ పెట్టించింది. అంతా తప్పుబట్టారు. గట్టిగా హెచ్చరించారు. ఇంట్లో గొడవ జరిగిన అనంతరం కామాంధుడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే తాను చెప్పొద్దు అని వార్నింగ్ ఇచ్చినా చిన్నారి తల్లికి చెప్పడం..తల్లి పంచాయతీ పెట్టించి పదిమందిలో తప్పు కట్టించడంతో తట్టుకోలేకపోయాడు. అంతే ఆదివారం అర్థరాత్రి అంతా నిద్రపోతున్న సమయంలో ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు, ఇంటి ముందున్న కారుపై పెట్రోల్ పోసి నిప్పంటి పరారయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.