Vizag: దారుణం.. బస్సులో మహిళలపై యాసిడ్ దాడి
విశాఖలోని కంచరపాలెం (Kancharapalem) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు (RTC Bus)లో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి (Acid Attack)కి పాల్పడ్డాడు.
దిశ, వెబ్ డెస్క్: విశాఖలోని కంచరపాలెం (Kancharapalem) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు (RTC Bus)లో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి (Acid Attack)కి పాల్పడ్డాడు. పెందుర్తి నుంచి గిరిజాలకు వెళ్తున్న బస్సులో.. ఐటీఐ జంక్షన్ (ITI Junction) వద్ద ఈ ఘటన జరిగింది. యాసిడ్ పడటంతో మహిళలు బిగ్గరగా అరవగా వెంటనే డ్రైవర్ బస్సును ఆపాడు. ప్రయాణికులు పట్టుకునేలోగానే నిందితుడు పరారయ్యాడు. బాధిత మహిళలను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు.
సమాచారం అందుకున్న కంచరపాలెం CI చంద్రశేఖర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దాడిలో ఉపయోగించినది నిజంగానే యాసిడా లేక యాసిడ్ ను పోలిన ద్రావణమా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుల ఆరోగ్య పరిస్థితి పట్ల ఇంకా స్పష్టత రాలేదు. దాడి వెనుక కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.