Tirumala: తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం.. నేటి నుంచే అమలు
తిరుమల (Tirumala)లో రాజకీయ ప్రసంగాలపై (Political Speech) టీటీడీ (TTD) నిషేధం విధించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala)లో రాజకీయ ప్రసంగాలపై (Political Speech) టీటీడీ (TTD) నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. నిత్యం గోవింద నామాలతో మారుమ్రోగే పవిత్రమైన తిరుమల దివ్యక్షేత్రంలో .. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన రాజకీయ నాయకుల్లో కొందరు ఆలయం వెలుపల రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. వాటి వల్ల ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోంది. దీంతో అక్కడ ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోంది.
తిరుమలలో ఆధ్యాత్మకత్వాన్ని కాపాడాలని నిర్ణయించిన టీటీడీ.. రాజకీయ విమర్శలు చేయడాన్ని, రాజకీయాలపై మాట్లాడటాన్ని నిషేధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.