ఓటర్లకు టైం చెప్పేందుకు పెద్ద డిజిటల్ గడియారం..ఎక్కడంటే?

జిల్లాలో మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్న దృష్ట్యా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కదలివచ్చేలా జిల్లా యంత్రాంగం వినూత్నమైన ఆలోచన చేసింది.

Update: 2024-05-12 14:00 GMT

దిశ,ఏలూరు: జిల్లాలో మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్న దృష్ట్యా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కదలివచ్చేలా జిల్లా యంత్రాంగం వినూత్నమైన ఆలోచన చేసింది. ప్రజలందరికీ పోలింగ్ సమయాన్ని గుర్తు చేసేలా జిల్లా కలెక్టరేట్ లో పెద్ద సైజులో డిజిటల్ విధానంలో కౌంట్ డౌన్ గడియారాన్ని రాష్ట్ర తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రస్తుత ఎన్నికల్లో ఓటర్లను చైతన్యపరచి ఓటింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగా పోలింగ్‌కు ప్రజలను సమాయత్తం చేసేందుకు కలెక్టరేట్ లో శనివారం నుంచి కౌంట్ డౌన్ గడియారాన్ని రాష్ట్ర తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నెలకొల్పింది. సోమవారం పోలింగ్ సమయానికి గడియారంలో సమయం పూర్తి అయ్యేలా టైం సెట్ చేశారు. ఈ పెద్ద సైజు డిజిటల్ గడియారాన్ని చూసేందుకు ప్రజలందరూ కలెక్టర్‌కు వస్తున్నారు.


Similar News