స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన రూ. 4 వేల కోట్లు సిద్దం: డా .కె.ఏ.పాల్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రవేటికరణ కాకుండా కాపాడటానికి కావాల్సిన 4 వేల కోట్లు తన వద్ద సిద్దంగా ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ అన్నారు.
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రవేటికరణ కాకుండా కాపాడటానికి కావాల్సిన రూ. 4 వేల కోట్లు తన వద్ద సిద్దంగా ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ అన్నారు. నగరంలోని డా .కె.ఏ. ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన మూలధనం రూ. 4 వేల కోట్లు అమెరిక వెళ్లి సమకుర్చానని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేసి అనుమతి కోరతూ కేంద్రాని జూన్ 4 వరకూ సమయం ఇచ్చానని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను అమ్మకుండా ఆపామన్న విషయాన్ని తెలుగు ప్రజలకు తెలియాలని జూన్ 4 లోపల అనుమతి ఇవ్వకపోతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రం తన ప్రతిపాదనకు అనుకూలంగా స్పందిస్తే 72 గంటల్లో రూ. 4 వేల కోట్ల వైట్ మనీని చెల్లించేందుకు సిద్దంగా ఉన్నానని ఆయన తెలిపారు.
ఒకవేళ మాట తప్పితే తన పాస్ పోర్ట్ సీజ్ చేసుకోవచ్చునని, ఈ రూ. 4 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ థర్డ్ ఫేస్ రన్ చేయవచ్చని, ఇది16 వేల కుటుంబాలకు శుభవార్తని చెప్పు్కొచ్చారు. నిజానికి ప్రధాని మోడీ దగ్గర స్టీల్ ప్లాంట్ పోరాటకమిటీ నేతలు 27 మందిని కూర్చోపెడదామనుకున్నాను. ఏం జరిగిందో తెలీదు వారు రాలేకపోయారు. స్టీల్ ప్లాంట్‌పై ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని నాకు అనుమానంగా ఉంది. మరోసారి ప్రయత్నించి వారితో మోడీని కలిసే ఏర్పాటు చేస్తాను. అంతేకాకుండా బీజేపీ అవినీతి చేస్తోంటే ఏపిలో పాలక ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నించలేకపోతున్నారని మరోసారి జగన్ సీఎం అయితే ఏంటి లాభమని ఆయన ప్రశ్నించారు. జనసైనికులు తనతో కలిసిరావాలని రాష్ట్రంలో రెండు కులాల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని ఆయన అన్నారు. వాలంటీర్లకు నెలకు ఇచ్చే రూ. 5 వేల జీతంతో తిండి ఎలా దొరుకుందని, వాళ్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని, తనను గెలిపిస్తే తొలిదశలో లక్ష మంది వాలంటీర్లను పర్మినెంట్ చేస్తానని తెలిపారు. జేడి లక్ష్మీనారాయణ మాదిరి జనసైనికులు ప్రజాశాంతి పార్టీలోకి రావాలని ఆయన పిలిపునిచ్చారు.