10th Exams: విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి పరీక్ష షెడ్యూల్ లో స్వల్ప మార్పు..!

రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష షెడ్యూల్(Exam Shedule) ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

Update: 2024-12-13 17:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష షెడ్యూల్(Exam Shedule) ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబధించి పరీక్ష షెడ్యూల్ ను మంత్రి నారా లోకేష్(Nara Lokesh) బుధవారం రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. తొలుత ప్రకటించిన టెన్త్ క్లాస్ పరీక్ష షెడ్యూల్ లో స్వల్ప మార్పులు(Small changes) జరిగే అవకాశముంది. కాగా ప్రభుత్వం మార్చి 31న సోషల్ స్టడీస్(Social Studies) ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఆ రోజున ప్రభుత్వం కేలండర్(Govt calendar)లో రంజాన్ హాలిడే గా పేర్కొంది. కాగా నెలవంక 31న కనిపిస్తే అదే రోజు రంజాన్ ఫెస్టివల్ ఉంటుంది. ఒకవేళ ఆ రోజునే పండగ వస్తే మరుసటి రోజైన ఏప్రిల్ 1న ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులు రెడ్డి(Srinivasulu Reddy) ఓ ప్రకటనలో తెలిపారు.

టెన్త్ క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే..

  • మార్చి 17 - ఫస్ట్ లాంగ్వేజ్
  • మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 21 - ఇంగ్లీష్
  • మార్చి 24 - మ్యాథ్స్
  • మార్చి 26 - ఫిజిక్స్
  • మార్చి 28 - బయాలజీ
  • మార్చి 29 - ఒకేషనల్
  • మార్చి 31 - సోషల్ స్టడీస్ 
Tags:    

Similar News