Red SandalWood : రూ.10 కోట్ల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ఏపీ పోలీసులు రూ.10 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు(Red SandalWood) స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-12-13 17:11 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ పోలీసులు రూ.10 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు(Red SandalWood) స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్(Gujarath) లోని పాటన్ లో 5 టన్నుల బరువు గల 155 ఎర్ర చందనం దుంగలను గుజరాత్ పోలీసుల సహాయంతో ఏపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు(AP TaskForce Police) పట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన దుంగల విలువ రూ.10 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగలను తిరుపతికి, నిందితులను ట్రాన్సిట్ వారంట్(Transit Warrat) పై ఏపీకి తరలిస్తామని పోలీసులు తెలియజేశారు.

Tags:    

Similar News