మారిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్
దిశ, ఏపీబ్యూరో: ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మారింది. మొత్తం నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలిదశ నామినేషన్ల ప్రక్రియ జనవరి 29న ప్రారంభమవుతోండగా.. ఫిబ్రవరి 9న పోలింగ్, అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేయనున్నారు. రెండో దశ ఫిబ్రవరి 2 నుంచి మొదలై 13న పోలింగ్, ఫలితాలతో ముగియనుంది. ఇక మూడో దశలో భాగంగా ఫిబ్రవరి 6 నామినేషన్ల స్వీకరణ, 17న పోలింగ్, ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇక […]
దిశ, ఏపీబ్యూరో: ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మారింది. మొత్తం నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలిదశ నామినేషన్ల ప్రక్రియ జనవరి 29న ప్రారంభమవుతోండగా.. ఫిబ్రవరి 9న పోలింగ్, అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేయనున్నారు. రెండో దశ ఫిబ్రవరి 2 నుంచి మొదలై 13న పోలింగ్, ఫలితాలతో ముగియనుంది. ఇక మూడో దశలో భాగంగా ఫిబ్రవరి 6 నామినేషన్ల స్వీకరణ, 17న పోలింగ్, ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇక చివరి దశ నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 10న చేపట్టనున్నారు. నాలుగో దశ పోలింగ్, ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 21న ఉంటుందని పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ స్పష్టం చేసింది.
తొలి దశలో..
జనవరి 29 నుంచి నామినేషన్ల స్వీకరణ
31 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన
2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
3న అభ్యంతరాలపై తుది నిర్ణయం
4న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
9న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు)
అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
రెండో దశ..
ఫిబ్రవరి 2 నుంచి నామినేషన్ల స్వీకరణ
4 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
5న నామినేషన్ల పరిశీలన
6న నామినేషన్లపై అభ్యంతరాల పరిశీలన
7న అభ్యంతరాలపై తుది నిర్ణయం
8న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
13న పోలింగ్, అదే రోజు లెక్కింపు, ఫలితాలు విడుదల
మూడో దశ..
ఫిబ్రవరి 6 నుంచి నామినేషన్ల స్వీకరణ
8న నామినేషన్ల దాఖలుకు తుది గడువు
9న నామినేషన్ల పరిశీలన
10న నామినేషన్లపై అభ్యంతరాల పరిశీలన
11న అభ్యంతరాలపై తుది నిర్ణయం
12న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
17న పోలింగ్, అదే రోజు లెక్కింపు, ఫలితాలు విడుదల
నాలుగో దశ..
ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ
12న నామినేషన్ల దాఖలుకు తుది గడువు
13న నామినేషన్ల పరిశీలన
14న నామినేషన్లపై అభ్యంతరాల పరిశీలన
15న అభ్యంతరాలపై తుది నిర్ణయం
16న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
21న పోలింగ్, అదే రోజు లెక్కింపు, ఫలితాలు విడుదల