టపాసులు కాల్చడానికి రెండు గంటలు!
దిశ, ఏపీ బ్యూరో: దీపావళి పండుగ రోజున రాత్రి 8 నుంచి 10 గంటల్లోపే టపాసులు కాల్చుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. టపాసుల అమ్మకాలపై కూడా కొన్ని నిషేధాజ్ఞలు విధించింది. కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే విక్రయించాలని స్పష్టం చేసింది. ప్రతి షాపుకి మధ్య 10 అడుగుల దూరం కచ్చితంగా పాటించాలని.. కొనుగోలు దారుల మధ్య ఖచ్చితంగా 6 […]
దిశ, ఏపీ బ్యూరో: దీపావళి పండుగ రోజున రాత్రి 8 నుంచి 10 గంటల్లోపే టపాసులు కాల్చుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. టపాసుల అమ్మకాలపై కూడా కొన్ని నిషేధాజ్ఞలు విధించింది. కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే విక్రయించాలని స్పష్టం చేసింది. ప్రతి షాపుకి మధ్య 10 అడుగుల దూరం కచ్చితంగా పాటించాలని.. కొనుగోలు దారుల మధ్య ఖచ్చితంగా 6 అడుగులు దూరం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపింది. దీనికి తోడు టపాసులు అమ్మే షాపుల వద్ద శానిటైజర్‌లు వినియోగించకూడాదని హెచ్చరికలు చేసింది.