నేనెందుకు చేస్తా? : అనసూయ

రంగస్థలం రంగమ్మత్త అనసూయ.. ఇప్పుడు తల్లి పాత్రలో కనిపించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. హీరో నాగ్ అశ్విన్‌కు మదర్‌గా నటించబోతోందని టాక్. ముందుగా ఈ సినిమాలో హీరోకు తల్లిదండ్రులుగా ఇంద్రజ, నరేష్‌లను ఫైనల్ చేశారు. అయితే, కరోనా కారణంగా తాను ఇప్పుడే షూటింగ్‌లకు హాజరుకాలేనని ఇంద్రజ చెప్పడంతో జబర్దస్త్ యాంకర్ అనసూయను ఈ పాత్రకు సెలెక్ట్ చేశారనే ప్రచారం జరిగింది. కానీ, అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది అనసూయ. యంగ్ హీరోకు తల్లి పాత్రలో కనిపించనున్నట్లు వస్తున్న వార్తల్లో […]

Update: 2020-07-18 01:08 GMT

రంగస్థలం రంగమ్మత్త అనసూయ.. ఇప్పుడు తల్లి పాత్రలో కనిపించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. హీరో నాగ్ అశ్విన్‌కు మదర్‌గా నటించబోతోందని టాక్. ముందుగా ఈ సినిమాలో హీరోకు తల్లిదండ్రులుగా ఇంద్రజ, నరేష్‌లను ఫైనల్ చేశారు. అయితే, కరోనా కారణంగా తాను ఇప్పుడే షూటింగ్‌లకు హాజరుకాలేనని ఇంద్రజ చెప్పడంతో జబర్దస్త్ యాంకర్ అనసూయను ఈ పాత్రకు సెలెక్ట్ చేశారనే ప్రచారం జరిగింది. కానీ, అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది అనసూయ. యంగ్ హీరోకు తల్లి పాత్రలో కనిపించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. కరోనా కారణంగా యాంకరింగ్ చేసేందుకే నిరాకరిస్తుంటే.. కొత్తగా సినిమాలు ఎలా చేయగలనని ప్రశ్నిస్తోంది అనసూయ.

Tags:    

Similar News