పసరు మందు పంపిణీ ఎందుకు ఆపేశానంటే : ఆనందయ్య
దిశ, వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా నివారణకు పసరు మందు పంపిణీ నిలిపివేయడానికి గల కారణాలపై ఆనందయ్య క్లారిటీ ఇచ్చారు. ఆయూష్ విభాగం వారు పసరు మందులో హానికరమైన పదర్థాలు ఏవీ వాడలేదని స్పష్టం చేసినా ఐసీఎంఆర్ నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్లే పసరు మందు తయారీ నిలిపివేసినట్లు ఆనందయ్య వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే మందు తయారీని ప్రారంభిస్తానని […]
దిశ, వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా నివారణకు పసరు మందు పంపిణీ నిలిపివేయడానికి గల కారణాలపై ఆనందయ్య క్లారిటీ ఇచ్చారు. ఆయూష్ విభాగం వారు పసరు మందులో హానికరమైన పదర్థాలు ఏవీ వాడలేదని స్పష్టం చేసినా ఐసీఎంఆర్ నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్లే పసరు మందు తయారీ నిలిపివేసినట్లు ఆనందయ్య వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే మందు తయారీని ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. శుక్రవారం నుంచి పసరు మందు ఇస్తానని జరుగుతున్న ప్రచారం అవాస్తమని ఆనందయ్య చెప్పుకొచ్చారు. మందు తయారీకి వినియోగించే వనమూలికలు, ద్రవ్యాలు కూడా తన వద్ద లేవని వెల్లడించారు.వదంతులు నమ్మి ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దని ఆనందయ్య ప్రజలకు సూచించారు.