‘మోటార్ సైకిల్ వీల్‌చెయిర్’.. ఇక నుంచి వారికి ఎవరి సాయం అవసరం లేదు

దిశ, ఫీచర్స్ : కాళ్లు విరిగిపోయినా, చచ్చుపడిపోయినా, వెన్నుముక  గాయాలైనా, మొత్తంగా నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ‘వీల్ చెయిర్’‌ ఉపయోగిస్తాం. ఎవరి సాయం లేకుండా తమకు తాముగా ఇంట్లో, ఆఫీస్‌లో తిరిగేందుకు ఇది ఉపయోగపడుతుంది. కానీ బయటకు వెళ్లాలంటే మాత్రం ఒకరు తప్పనిసరిగా తోడు రావాల్సిందే. ఈ క్రమంలోనే ఎవరి అవసరం లేకుండానే వీల్‌ చెయిర్‌తోనే సిటీ చుట్టి వచ్చేలా దానికే ఓ హ్యాండిల్ అమర్చి బైక్‌లా మార్చేసింది చెన్నయ్‌కి చెందిన ‘నియో మోషన్’ అనే కంపెనీ. […]

Update: 2021-08-23 03:43 GMT

దిశ, ఫీచర్స్ : కాళ్లు విరిగిపోయినా, చచ్చుపడిపోయినా, వెన్నుముక గాయాలైనా, మొత్తంగా నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ‘వీల్ చెయిర్’‌ ఉపయోగిస్తాం. ఎవరి సాయం లేకుండా తమకు తాముగా ఇంట్లో, ఆఫీస్‌లో తిరిగేందుకు ఇది ఉపయోగపడుతుంది. కానీ బయటకు వెళ్లాలంటే మాత్రం ఒకరు తప్పనిసరిగా తోడు రావాల్సిందే. ఈ క్రమంలోనే ఎవరి అవసరం లేకుండానే వీల్‌ చెయిర్‌తోనే సిటీ చుట్టి వచ్చేలా దానికే ఓ హ్యాండిల్ అమర్చి బైక్‌లా మార్చేసింది చెన్నయ్‌కి చెందిన ‘నియో మోషన్’ అనే కంపెనీ.

వీల్‌చైర్ వినియోగదారులు ఎవరిపైనా ఆధారపడకుండా నగరాల్లో తిరగడానికి సహాయపడేలా ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో నియో మోషన్ అనే సంస్థ ‘నియో బోల్ట్’ రూపొందించింది. అయితే ఈ బైక్ గురించి ఇప్పటివరకు చాలామందికి తెలియదు. బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రకు కూడా దీనిపై అవగాహన లేదు. అయితే స్థానికంగా కొత్త ఇన్వెన్షన్‌కు సంబంధించి నెట్టింట్లో ఏ వార్త వచ్చినా వెంటనే ఆ వీడియోను షేర్ చేస్తూ, దాన్ని తయారుచేసిన వారి టాలెంట్‌ మెచ్చుకుంటాడు ఆనంద్ మహీంద్ర. ఈ మేరకు ఇటీవల వినూత్నమైన మోటరైజ్డ్ వీల్‌చైర్‌పై డ్రైవ్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. ఈ ఆవిష్కరణ వికలాంగుల జీవితాలను వేగవంతం చేయడంలో సహాయపడుతుందని తెలిపాడు. ‘ఈ వీడియో ఎంత పాతదో, ఇది ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు. సిగ్నల్‌లో చూశాను. కానీ ఇది నిజంగా ఆలోచనాత్మక ఆవిష్కరణ. వికలాంగుల జీవితాలను వేగవంతం చేస్తుంది. దీనికి మద్దతు అవసరం. సహాయం చేయడానికి నేను సంతోషిస్తాను’ అని ట్వీట్ చేశాడు.

మహీంద్రా ట్వీట్‌కు ప్రతిస్పందిస్తూ.. ‘నియో మోషన్, చెన్నైకి చెందిన IIT మద్రాస్ ఇంక్యుబేట్ చేసిన స్టార్టప్. వృద్ధులు, డిసేబుల్డ్ పర్సన్స్ కోసం వీల్‌చైర్లు, వాటి ఉపకరణాలను తయారు చేస్తాం. ఈ ఆవిష్కరణ నియోబోల్ట్ కాగా ఇది బ్యాటరీతో నడుస్తుంది. మోటరైజ్డ్ మెషిన్‌ను వేరు చేసి, వీల్‌చైర్‌కు తిరిగి జతచేయవచ్చు, దీనివల్ల ఫిజికల్లీ డిసేబుల్డ్ ఉన్నవాళ్లు కూడా సులభంగా ట్రావెల్ చేయొచ్చు’ అని నియోమోషన్ సమాధానమిచ్చింది.

 

Tags:    

Similar News