యాసిడ్ తాగి వృద్ధురాలు మృతి
దిశ, వెబ్ డెస్క్: నిద్రమత్తులో దాహం వేయగా నీటికి బదులు యాసిడ్ తాగిన వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఆదివారం చిత్తూరులో చోటుచేసుకుంది. నగరంలోని నివాసముంటున్న సుశీలమ్మ (84) కాలకృత్యాలకు వెళ్లి వస్తూ దాహం వేయడంతో ఎదురుగా ఉన్న యాసిడ్ ను నీరు అనుకొని పొరపాటున తాగింది. కొంతసేపటికి గొంతులో మంట వేస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో హుటాహుటిన ఆ వృద్ధురాలిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. ఈ […]
దిశ, వెబ్ డెస్క్: నిద్రమత్తులో దాహం వేయగా నీటికి బదులు యాసిడ్ తాగిన వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఆదివారం చిత్తూరులో చోటుచేసుకుంది. నగరంలోని నివాసముంటున్న సుశీలమ్మ (84) కాలకృత్యాలకు వెళ్లి వస్తూ దాహం వేయడంతో ఎదురుగా ఉన్న యాసిడ్ ను నీరు అనుకొని పొరపాటున తాగింది. కొంతసేపటికి గొంతులో మంట వేస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో హుటాహుటిన ఆ వృద్ధురాలిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.