నిన్నటి మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా గురువారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. పంజాబ్ బ్యాటింగ్ చేసే సమయంలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ 5వ బంతి ముజీబ్ ఉర్ రెహ్మాన్ బ్యాట్‌ను తాకి కీపర్ బెయిర్‌స్టో చేతిలో పడింది. అయితే అది బంప్ బాల్ అనుకొని అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రివ్యూ కోరారు. రీప్లేలో అది క్లియర్ […]

Update: 2020-10-09 01:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా గురువారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. పంజాబ్ బ్యాటింగ్ చేసే సమయంలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ 5వ బంతి ముజీబ్ ఉర్ రెహ్మాన్ బ్యాట్‌ను తాకి కీపర్ బెయిర్‌స్టో చేతిలో పడింది. అయితే అది బంప్ బాల్ అనుకొని అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రివ్యూ కోరారు.

రీప్లేలో అది క్లియర్ అవుట్ అని తెలిసి థర్డ్ అంపైర్ దాన్ని అవుటిచ్చాడు. కానీ రెహ్మాన్ దానికి తిరిగి రివ్యూ కోరాడు. దీంతో అంపైర్లతో పాటు సన్‌రైజర్స్ కెప్టెన్ కూడా ఆశ్చర్యపోయారు. అయితే నిబంధనల ప్రకారం మొదటికి అంపైర్ రివ్యూ కావడంతో రెండో సారి బ్యాట్స్‌మాన్ రివ్యూకు పంపారు. అందులో కూడా ఫలితం అదే ఉంటుంది కదా. ఈ సారి అల్ట్రా ఎడ్జ్ చూసి మరీ థర్డ్ అంపైర్ అవుటిచ్చాడు.

Tags:    

Similar News