పోషకాలు మెండుగా ఉండే ఉసిరి రసం
సాధారణంగా ఉసిరికాయలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. నిజానికి ఉసిరిలో విలువైన పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఉసిరి రసం తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఉసిరి రసంను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్ధాలు: కందిపప్పు-అరకప్పు, ఉసిరికాయలు (పెద్దవి)-ఐదు, మిరియాలు పొడి -పావు టీస్పూన్ జీలకర్ర పొడి -అర టీస్పూను, పచ్చిమిర్చి -నాలుగు అల్లంవెల్లుల్లి పేస్ట్ -ఒక టీస్పూన్ కొత్తిమీర -ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు -రెండు రెమ్మలు ఆవాలు -పావు స్పూన్ నూనె -ఒక టీస్పూన్ […]
సాధారణంగా ఉసిరికాయలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. నిజానికి ఉసిరిలో విలువైన పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఉసిరి రసం తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఉసిరి రసంను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు:
కందిపప్పు-అరకప్పు,
ఉసిరికాయలు (పెద్దవి)-ఐదు,
మిరియాలు పొడి -పావు టీస్పూన్
జీలకర్ర పొడి -అర టీస్పూను,
పచ్చిమిర్చి -నాలుగు
అల్లంవెల్లుల్లి పేస్ట్ -ఒక టీస్పూన్
కొత్తిమీర -ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు -రెండు రెమ్మలు
ఆవాలు -పావు స్పూన్
నూనె -ఒక టీస్పూన్
పసుపు -అర టీస్పూను
ఇంగువ -చిటికెడు
తయారీ విధానం:
ముందుగా ఉసిరికాయల్లోంచి గింజలను తీసేయాలి. ఉసిరి కాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వాటిలో ముప్పావ్ కప్పు నీళ్లు పోసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పేస్టులో నుంచి రసాన్ని తీసి ఒక గిన్నెలో పోయాలి. అనంతరం ఒక గిన్నెలో ఉడికించిన కందిపప్పు, ఉసిరి రసం, జీలకర్ర, మిరియాల పొడి, పసుపు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి.
ఆ తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు వేసి వేగనివ్వాలి. దానిలో కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఇంగువలను అందులో వేసి చక్కని సువాసన వచ్చేదాకా వేగించాలి. అందులో ముందుగా కలిపి పెట్టుకున్న పప్పు నీళ్లు పోసి ఉడకనివ్వాలి. రసం కాసేపు మరిగిన తర్వాత స్టవ్ మీద నుంచి దించుకోవాలి. అనంతరం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను చల్లుకుంటే వేడి వేడి ఉసిరి రసం రెడీ. అన్నంలో వేడిగా కలుపుకు తింటే ఎంతో రుచిగా ఉంటుంది.