ప్రతి నెలా అమిత్ షా, నడ్డా పర్యటన

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు ప్రతి నెలా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటిస్తారని బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ అన్నారు. ప్రతినెలా వీరిరువురు వేర్వేరుగా రాష్ట్రానికి వస్తారని, పర్యటనకు సంబంధించిన తేదీలు ఖరారు కావల్సి ఉన్నదని తెలిపారు. వీరి పర్యటనలతో రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుందని చెప్పారు. ప్రతి నెలా వరుసగా రెండు రోజులు షా, మూడు రోజులు నడ్డా పర్యటిస్తారని […]

Update: 2020-11-18 06:49 GMT

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు ప్రతి నెలా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటిస్తారని బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ అన్నారు. ప్రతినెలా వీరిరువురు వేర్వేరుగా రాష్ట్రానికి వస్తారని, పర్యటనకు సంబంధించిన తేదీలు ఖరారు కావల్సి ఉన్నదని తెలిపారు.

వీరి పర్యటనలతో రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుందని చెప్పారు. ప్రతి నెలా వరుసగా రెండు రోజులు షా, మూడు రోజులు నడ్డా పర్యటిస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించుకుని కేంద్ర నాయకులు బాధ్యత తీసుకున్నట్టు సమాచారం.

Tags:    

Similar News