కరోనా పేషెంట్ పై లైంగికదాడి
తిరువనంతపురం: దేశంలో కరోనా వైరస్‌తో పాటు కామాందులు కూడా పెరుగుతున్నారు. చివరకు వైరస్ బారీన పడ్డ యువతులను కూడా వదలకుండా అత్యాచారం చేస్తున్నారు. ఇటీవల దేశ రాజధానిలో ఓ ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇది మరవక ముందే కరోనా సోకిన బాధితురాలిని(19) మార్గమధ్యలో అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం చేసి ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్చిన ఘటన కేరళలో సంచలనంగా మారింది. వివరాళ్లోకి వెళితే… కేరళలోని పతానంతిట్ట జిల్లాలో శనివారం రాత్రి కరోనా పేషెంట్‌పై అంబులెన్స్ […]
తిరువనంతపురం: దేశంలో కరోనా వైరస్‌తో పాటు కామాందులు కూడా పెరుగుతున్నారు. చివరకు వైరస్ బారీన పడ్డ యువతులను కూడా వదలకుండా అత్యాచారం చేస్తున్నారు. ఇటీవల దేశ రాజధానిలో ఓ ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇది మరవక ముందే కరోనా సోకిన బాధితురాలిని(19) మార్గమధ్యలో అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం చేసి ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్చిన ఘటన కేరళలో సంచలనంగా మారింది.
వివరాళ్లోకి వెళితే…
కేరళలోని పతానంతిట్ట జిల్లాలో శనివారం రాత్రి కరోనా పేషెంట్‌పై అంబులెన్స్ డ్రైవర్ లైంగికదాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఒక వృద్ధురాలిని, 19 ఏళ్ల యువతి వేర్వేరు హాస్పిటళ్లలో చేరడానికి 108 అంబులెన్స్‌లో బయల్దేరారు. తొలుత వృద్ధురాలిని 25 ఏళ్ల అంబులెన్స్ డ్రైవర్ నౌఫాల్ హాస్పిటల్‌లో చేర్చాడు.
అనంతరం యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా అరన్ములా ఎయిర్‌పోర్టు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రేప్ చేశాడు. ఈ నేరం తర్వాత యువతిని కొవిడ్ కేర్ సెంటర్ దగ్గర వదిలివెళ్లాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపులు మొదలుపెట్టిన పోలీసులు సదరు డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి కేకే శైలజా మండిపడ్డారు. 108 డిపార్ట్‌మెంట్ నుంచి నిందితుడిని తొలగించాలని ఆదేశించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఏదేమైనా.. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్సులోనే ఓ యువతిని రేప్ చేయడం దారుణం.