‘డెలివరీ నెట్‌వర్క్ పటిష్టం’
దిశ, వెబ్‌డెస్క్: అదనపు డెలివరీ స్టేషన్ల ఏర్పాటు, కిరాణా దుకాణాలతో భాగస్వామ్యాన్ని పెంచుకోవడం ద్వారా పండుగ సీజన్‌కు ముందే తమ డెలివరీ నెట్‌వర్క్‌ను గణనీయంగా పెంచుకున్నట్టు అమెజాన్ ఇండియా సోమవారం తెలిపింది. ఈ చర్యల అమలుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పండుగ సీజన్‌లొ డెలివరీలను వేగంగా, సమర్థవంతంగా పంపిణీ చేయడానికి వీలు కల్పిస్తుందని కంపెనీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా డెలివరీ సేవల భాగస్వాముల ద్వారా నిర్వహించబడుతున్న 200 డెలివరీ స్టేషన్లను కంపెనీ నిర్వహిస్తోందని అమెజాన్ ఇండియా లాస్ట్ మైల్ […]
దిశ, వెబ్‌డెస్క్: అదనపు డెలివరీ స్టేషన్ల ఏర్పాటు, కిరాణా దుకాణాలతో భాగస్వామ్యాన్ని పెంచుకోవడం ద్వారా పండుగ సీజన్‌కు ముందే తమ డెలివరీ నెట్‌వర్క్‌ను గణనీయంగా పెంచుకున్నట్టు అమెజాన్ ఇండియా సోమవారం తెలిపింది. ఈ చర్యల అమలుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పండుగ సీజన్‌లొ డెలివరీలను వేగంగా, సమర్థవంతంగా పంపిణీ చేయడానికి వీలు కల్పిస్తుందని కంపెనీ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా డెలివరీ సేవల భాగస్వాముల ద్వారా నిర్వహించబడుతున్న 200 డెలివరీ స్టేషన్లను కంపెనీ నిర్వహిస్తోందని అమెజాన్ ఇండియా లాస్ట్ మైల్ ఆపరేషన్స్ డైరెక్టర్ ప్రకాష్ రోచ్లానీ తెలిపారు. అమెజాన్ ఇండియా ప్రస్తుతం సుమారు 350 నగరాల్లో 28 వేలకు పైగా కిరాణా దుకాణాలను కలిగి ఉంది.
‘ఐ హావ్ స్పేస్’ కార్యక్రమం ద్వారా మరిన్ని నగరాలకు విస్తరించే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా తమ కస్టమర్లు ఈ పండుగ సీజన్‌ను సౌకర్యవంతంగా జరుపుకునేందుకు, అదేసమయంలో తమ కస్టమర్లు, డెలివరీ భాగస్వాముల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకాష్ వెల్లడించారు.