అమెజాన్‌లో చేనేత, గిరిజన, హస్తకళా ఉత్పత్తుల మేళ!
దిశ, ఫీచర్స్: భారతదేశం గొప్ప హస్తకళ, కళాత్మక చిత్రకళల వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. అయితే లాక్‌డౌన్ సమయంలో చిన్న వ్యాపారాలతో పాటు హస్త కళాకారులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈ తరుణంలో సంప్రదాయ గిరిజన, స్థానిక హస్త కళాకారులు రూపొందించిన వస్తువులకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడేందుకు, చేతి వృత్తుల వారికి సహాయం చేయడానికి అమెజాన్ ఇండియా ముందుకు వచ్చింది. ఇందుకోసం ‘అమెజాన్ కరిగర్’ పేరుతో ప్రత్యేకమైన ఆన్‌లైన్ స్టోర్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బిద్రి, […]
దిశ, ఫీచర్స్: భారతదేశం గొప్ప హస్తకళ, కళాత్మక చిత్రకళల వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. అయితే లాక్‌డౌన్ సమయంలో చిన్న వ్యాపారాలతో పాటు హస్త కళాకారులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈ తరుణంలో సంప్రదాయ గిరిజన, స్థానిక హస్త కళాకారులు రూపొందించిన వస్తువులకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడేందుకు, చేతి వృత్తుల వారికి సహాయం చేయడానికి అమెజాన్ ఇండియా ముందుకు వచ్చింది. ఇందుకోసం ‘అమెజాన్ కరిగర్’ పేరుతో ప్రత్యేకమైన ఆన్‌లైన్ స్టోర్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బిద్రి, ధోక్రా, ఇక్కత్, పటచిత్ర, మధుబని, బ్లూ ఆర్ట్ పాటరీ వంటి క్రాఫ్ట్‌లతో సహా దాదాపు 1.2 లక్షల హస్తకళలు, చేనేత ఉత్పత్తులు అందిస్తోంది అమెజాన్.
భారతదేశంలో పండుగ సీజన్ మొదలు కావడంతో అమెజాన్.. ‘ట్రైబ్స్ ఇండియా’ భాగస్వామ్యంతో ‘కరిగర్ మేళా’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 12 లక్షల మంది కళాకారులు అమెజాన్ కరిగర్‌తో సంబంధం ఉన్న విక్రేతలతో పాటు 25 ప్రభుత్వ ఎంపోరియంల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఈ చొరవ ద్వారా అమెజాన్ ఇండియా తమ వ్యాపారాలను ప్రారంభించడానికి, స్కేలింగ్ చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి వివిధ మార్గాల్లో చేతివృత్తిదారులకు మద్దతు ఇస్తోంది. కరిగర్ మేళా భాగంగా, కరిగర్ విక్రేతలు ఆగస్టు 30, 2021 – సెప్టెంబర్ 12, 2021 వరకు రెండు వారాల పాటు అమెజాన్ (SOA-SellonAmazon) రుసుము మినహాయింపుతో 100% విక్రయం ద్వారా ప్రయోజనం పొందుతారు.
గత 12 నెలల్లో.. కొవిడ్ -19 వల్ల ఏర్పడిన ఆర్థిక అంతరాయం నుంచి చేతివృత్తుల వారు పుంజుకోవడానికి ‘స్టాండ్ ఫర్ హ్యాండ్‌మేడ్’ పేరుతో 10వారాల ఇన్షియేటివ్ ప్రొగ్రామ్ కూడా ప్రారంభించింది. ఇది తెలంగాణాలోని 56 గ్రామాల నుంచి 4500+ పోచంపల్లి నేత కార్మికులు, పశ్చిమ బెంగాల్ నుంచి 5000+ చేనేత కార్మికులు, తూర్పు భారతదేశంలోని 1000+ కళాకారులు, ఛత్తీస్‌గఢ్‌కు 10,000 మందికి పైగా కళాకారులు మళ్లీ తమ వ్యాపారాన్ని (చేనేత, హస్తకళల) ప్రారంభించడానికి వీలు కల్పించింది.
పండుగ సీజన్ రాబోతున్నందున, ఇటువంటి కార్యక్రమాలు దేశీయ హస్తకళాకారులు, నేత, గిరిజన కళాకారులను శక్తివంతం చేస్తాయి. భారతీయ కళల సంప్రదాయ వారసత్వం వృద్ధి చెందడానికి సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాం. దేశవ్యాప్తంగా భారతీయ చేతివృత్తిదారులు, నేత కార్మికులు ఈ-కామర్స్ ద్వారా వారి వృద్ధిని వేగవంతం చేయడానికి మాతో పాటు ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలతో సహకారం కొనసాగిస్తాం.
– అమిత్ అగర్వాల్, అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్