ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా మళ్లీ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' తేదీని మార్చిన అమెజాన్

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది పండుగ సీజన్ నేపథ్యంలో దిగ్గజ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటాపోటీగా ఉన్నాయి. సాధారణంగా ప్రతి ఏడు పండుగ సీజన్ సమయంలో ప్రత్యేక అమ్మకాలను నిర్వహించే క్రమంలో అమెజాన్ కంపెనీ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’, ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ‘బిగ్ బిలియన్ డేస్’ పేరుతో ఆఫర్లను ప్రకటిస్తాయి. ఈసారి సైతం అదే తరహాలో ఫ్లిప్‌కార్ట్ కంపెనీ అక్టోబర్ 7-10 తేదీల మధ్య బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఆ తర్వాత అమెజాన్ […]

Update: 2021-09-26 06:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది పండుగ సీజన్ నేపథ్యంలో దిగ్గజ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటాపోటీగా ఉన్నాయి. సాధారణంగా ప్రతి ఏడు పండుగ సీజన్ సమయంలో ప్రత్యేక అమ్మకాలను నిర్వహించే క్రమంలో అమెజాన్ కంపెనీ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’, ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ‘బిగ్ బిలియన్ డేస్’ పేరుతో ఆఫర్లను ప్రకటిస్తాయి. ఈసారి సైతం అదే తరహాలో ఫ్లిప్‌కార్ట్ కంపెనీ అక్టోబర్ 7-10 తేదీల మధ్య బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఆ తర్వాత అమెజాన్ 4వ తేదీ నుంచే తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించి పోటీకి ఆజ్యం పోసింది.

అయితే, వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ సంస్థ కూడా తన ప్రత్యేక సేల్‌ను అక్టోబర్ 3నుంచి 10వ తేదీకి మార్చింది. కానీ, అమెజాన్ సైతం ఆదివారం తన ప్రకటనలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను అక్టోబర్ 3 నుంచే ప్రారంభించనున్నట్టు స్పష్టం చేసింది. చిన్న చిన్న విక్రయదారులు, స్థానిక దుకాణ యజమానుల ప్రయోజనాలను కాపాడేందుకు, వారికి ప్రాధాన్యత కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని అమెజాన్ చెబుతోంది. ఇక ఫ్లిప్‌కార్ట్ సంస్థ తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను 3-10 వరకు నిర్వహిస్తుండగా, అమెజాన్ తన ప్రత్యేక సేల్‌ను నెల రోజుల పాటు దీపావళి వరకు నిర్వహించనున్నట్టు ఇదివరకే ప్రకటించింది. ఇక, అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఒకరోజు ముందుగానే ఈ సేల్ వర్తిస్తుందని తెలిపింది. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్‌కే చెందిన మరో ఫ్యాషన్ ఈ-కామర్స్ కంపెనీ మింత్రా కూడా అక్టోబర్ 3-10 తేదీల్లో ‘బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్’ సేల్‌ను ప్రకటించింది.

Tags:    

Similar News