ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ ఒప్పందానికి అమెజాన్ అడ్డు
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల రిటైల్ రంగంలో అతిపెద్ద మలుపుగా భావిస్తున్న రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆగష్టులో ఫ్యూచర్ గ్రూప్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌కు విక్రయించడం పట్ల దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. ఈ అంశంలో సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అమెజాన్‌కు సానుకూలంగా స్పందించింది. రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య జరిగిన ఒప్పందాన్ని నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు కాస్త ఊరట […]
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల రిటైల్ రంగంలో అతిపెద్ద మలుపుగా భావిస్తున్న రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆగష్టులో ఫ్యూచర్ గ్రూప్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌కు విక్రయించడం పట్ల దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. ఈ అంశంలో సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అమెజాన్‌కు సానుకూలంగా స్పందించింది. రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య జరిగిన ఒప్పందాన్ని నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు కాస్త ఊరట లభించింది. ఆర్బిట్రేషన్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్టు అమెజాన్ ప్రతినిధి తెలిపారు. అలాగే, అవసరమైన న్యాయ సలహాల ప్రకారమే ఫ్యూచర్ గ్రూపునకు చెందిన వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైందని, భారత చట్టాల ప్రకారం ఈ ఒప్పందం అమలవుతుందని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ప్రకటించింది. ఒప్పందం ప్రకారమే లావాదేవీలను పూర్తి చేస్తామని, ఫ్యూచర్ గ్రూప్‌తో జరిగిన ఒప్పందం వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నట్టు రిలయన్స్ రిటైల్ వెల్లడించింది.
అమెజాన్‌కున్న ఇబ్బందులేంటి..
గత కొన్నేళ్లుగా సవాళ్లను ఎదుర్కొంటున్న ఫ్యూచర్ గ్రూపునకు చెందిన హోల్‌సేల్, రిటైల్, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ వ్యాపారాలను ఈ ఏడాది ఆగష్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన రిటైల్ వెంచర్స్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 24,713 కోట్లు. అయితే, గతంలో ఫ్యూచర్ గ్రూపునకు చెందిన ఫ్యూచర్ కూపన్స్ లిమిటెడ్‌లో అతిపెద్ద ఈ-కామర్స్ అమెజాన్ 2019లో 49 శాతం వరకు ఇన్వెస్ట్ చేసింది. ఫ్యూచర్ కూపన్స్‌కు ఫ్యూచర్ రిటైల్‌లో 7.3 శాతం వరకు వాటా కొనసాగిస్తోంది. 3 ఏళ్ల నుని 10 ఏళ్లలోగా ఫ్యూచర్ రిటైల్ కొనుగోలు చేసేందుకు హక్కుగా అమెజాన్‌కు ఫ్యూచర్ గ్రూప్ సంస్థ మాటిచ్చింది.
దీంతో, ఇదివరకు తమతో జరిగిన ఒప్పందాన్ని ఖాతరు చేయకుండా రిలయన్స్-ఫ్యూచర్స్ మధ్య జరిగిన ఒప్పందం తమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని అమెజాన్ స్పష్టం చేస్తోంది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు అమెజాన్ సంస్థ సింగపూర్ ఆర్బిట్రేషన్ ముందుకు తీసుకెళ్లింది. దీని ప్రకారం.. ఈ నెల తొలివారంలోనే ఫ్యూచర్ గ్రూపునకు ఆర్బిట్రేషన్ నోటీసులను కూడా పంపింది. ఈ క్రమంలో అమెజాన్ దాఖలు చేసిన ఆర్బిట్రేషన్‌కు అనూకూలంగా మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. తుది నిర్ణయం తీసుకునే వరకు ఒప్పందంపై ముందుకెళ్లకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధనల ప్రకారం..ఒప్పందం 90 రోజుల వరకూ నిలుపుదల ఉంటుంది. సాధారణంగా ఇంటర్‌నేషనల్ ఆర్బిట్రేషన్‌ను భారత చట్టాలు పరిగణలోకి తీసుకోవు. అయితే, కంపెనీలు ఈ నిబంధనలను పాటిస్తున్నాయి.
ఇరు కంపెనీల షేర్లకు బ్యాడ్‌న్యూస్..
చట్టపరమైన హక్కులను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎక్కువ ఆలస్యం చేయకుండా ఒప్పందంలో తర్వాతి ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ వెల్లడించింది. కాగా, రిటైల్ రంగంలోనే అతిపెద్ద డీల్‌గా భావిస్తున్న ఈ ఒప్పందం నిలుపుదల గురించిన వార్తలతో ఫ్యూచర్ గ్రూప్‌తో పాటు రిలయన్స్ షేర్లు డీలాపడ్డాయి. మిడ్ సెషన్ తర్వాత ఫ్యూచర్ గ్రూప్ సంస్థల్లో ఫ్యూచర్ రిటైల్ సుమారు 6 శాతం క్షీణించి రూ. 73.75 వద్ద కొనసాగగా, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ 5 శాతం తగ్గి రూ. 91.10 వద్ద ట్రేడయింది. ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ సైతం 5 శాతం నీరసించి రూ. 9.50 వద్ద ఉంది. ఫ్యూచర్ కన్జ్యూమర్ 4.46 శాతం పడిపోయి రూ. 7.50 వద్ద, ఫ్యూచర్ మార్కెట్ నెట్‌వర్క్స్ 5 శాతం దిగజారి రూ. 15.20 వద్ద కొనసాగుతున్నాయి. వీటితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ కూడా 3.62 శాతం తగ్గి రూ. 2,036.65 వద్ద ఉంది.