తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 11 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశాలు గురువారం రాత్రి వాయిదా పడ్డాయి.

Update: 2025-03-27 15:50 GMT
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 11 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశాలు గురువారం రాత్రి వాయిదా పడ్డాయి. సభలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక తీర్మానాలు సైతం చేశారు. ఇవాళ ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) ఉభయసభల్లోనూ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. మూడు బిల్లులపై చర్చ చేశారు. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లు 2025 శాసనసభలో ప్రవేశపెట్టి, చర్చించి, సభ ఆమోదం తెలిపారు. అనంతరం ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. గత నెల ఫిబ్రవరి 24న ప్రారంభమైన సమావేశాలు.. మార్చి 27వ తేదీ వరకూ కొనసాగాయి.

Tags:    

Similar News