Bandi Sanjay: ఆ విషయాన్ని నిరూపిస్తా.. మీరు సిద్ధమా: సర్కార్‌కు బండి సంజయ్ సవాల్

తెలంగాణ సర్కార్ (Telangana Government) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది.

Update: 2025-03-31 09:00 GMT
Bandi Sanjay: ఆ విషయాన్ని నిరూపిస్తా.. మీరు సిద్ధమా: సర్కార్‌కు బండి సంజయ్ సవాల్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్ (Telangana Government) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హుజూర్‌నగర్‌ (Huzurnagar)లో సన్నబియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. శ్రీమంతుల తరహాలో పేదలు కూడా సన్న బియ్యం తినాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ సర్కార్ (Congress Government) ఈ పథకాన్ని అమలు చేస్తోందని కామెంట్ చేశారు. చరిత్రలో ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ పథకాన్ని కొనసాగించాల్సిందేనని అన్నారు.

ఈ క్రమంలోనే సన్నబియ్యం పంపిణీ పథకంపై ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. పథకానికి సంబంధించి మెజారిటీ ఖర్చును కేంద్ర ప్రభుత్వమే (Central Government) భరిస్తోందని అన్నారు. కిలోకు రూ.40లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని వెల్లడించారు. సన్న బియ్యం పంపిణీతో రేవంత్ సర్కార్2పై కిలోకు పడే భారం రూ.10 మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ఈ పథకానికి కేంద్రం అక్షరాల రూ.10 వేల కోట్లు ఇస్తుందని.. ఆ విషయాన్ని తాను నిరూపించేందుకు సిద్ధం అంటూ ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పథకం అమలు నేపథ్యంలో తాము సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫొటో పెట్టొట్టదని అనలేదని.. ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఫొటో ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. హుజూర్‌నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా అంత పెద్ద కార్యక్రమం నిర్వహించినా.. ఎక్కడా ప్రధాని మోడీ ఫొటో లేదని అన్నారు. కనీసం సన్న బియ్యం పంపిణీ పథకానికి కేంద్ర సహకరిస్తోందని ఏ ఒక్కరూ చెప్పలేకపోయారంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

Read More..

TG Govt: 'వివాదం ఈనాటిది కాదు' హెచ్ సీయూ భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన 

 

Tags:    

Similar News