కార్మికుల కష్టంతోనే సింగరేణిలో అద్భుత ఫలితాలు

దిశ, మణుగూరు: మణుగూరు సింగరేణి బొగ్గుగనిలో కార్మికుల కష్టం-శ్రమ-కృషి-ఐక్యతతోనే సింగరేణిలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని మణుగూరు సింగరేణి జీఎం జక్కం రమేష్ అన్నారు. మంగళవారం మండలంలోని సింగరేణి జీఎం కార్యాలయంలో ఎస్ఓటు జీఎం ఆధ్వర్యంలో పత్రికావిలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ…. కార్మికుల కష్టం-కృషి-శ్రమతోనే బొగ్గు ఉత్పత్తి తీయడంలో బొగ్గు రవాణా చేయడంలో మణుగూరు ప్రాంతమే నెంబర్ వన్ గా నిలిచిందని వ్యాఖ్యానించారు. నవంబర్ నెల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 8,85,233 లక్షల […]

Update: 2021-11-30 06:19 GMT

దిశ, మణుగూరు: మణుగూరు సింగరేణి బొగ్గుగనిలో కార్మికుల కష్టం-శ్రమ-కృషి-ఐక్యతతోనే సింగరేణిలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని మణుగూరు సింగరేణి జీఎం జక్కం రమేష్ అన్నారు. మంగళవారం మండలంలోని సింగరేణి జీఎం కార్యాలయంలో ఎస్ఓటు జీఎం ఆధ్వర్యంలో పత్రికావిలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ…. కార్మికుల కష్టం-కృషి-శ్రమతోనే బొగ్గు ఉత్పత్తి తీయడంలో బొగ్గు రవాణా చేయడంలో మణుగూరు ప్రాంతమే నెంబర్ వన్ గా నిలిచిందని వ్యాఖ్యానించారు. నవంబర్ నెల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 8,85,233 లక్షల టన్నులకు గాను 90 శాతం ఉత్పత్తిని సాదించమన్నారు. ఏప్రిల్ నుంచి 30-నవంబర్-2021 వరకు ఉత్పత్తి లక్ష్యం 70,98000 గాను 8096849 సాధించి 114 బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందన్నారు. ఓబీలలో వెలికితీత లక్ష్యం 15.05 కాగా 16.43 లక్షల క్యూబిక్ మీటర్లు 109 శాతం వెలికితీశామన్నారు.

అలాగే రైల్వే ర్యాక్స్ ద్వారా బొగ్గు రవాణా 150 ర్యాక్స్ పంపించి నవంబర్ నెలలో మొత్తం రవాణా 8 లక్షల 92 వేల 525 టన్నులు ర్యాక్స్ ద్వారా బొగ్గు రవాణా చేయడం జరిగిందన్నారు. కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, కుటుంబ సభ్యులు కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిందని భావించకుండా డెల్టా-ఒమిక్రాన్ వంటి వైరస్ ప్రభావం క్రమక్రమంగా విస్తరిస్తుందని కార్మికులందరూ, కుటుంబసభ్యులు మాస్క్ తప్పనిసరిగా ధరించి జనసమూహాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి కార్మికునికి, ప్రతి కార్మికుని కుటుంబానికి సింగరేణి సంస్థ అండగా నిలుస్తుందని తెలియజేశారు. ఈకార్యక్రమంలో సింగరేణికి సంబంధించిన అన్ని డిపార్ట్ మెంట్ల అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News