పూర్వీకుల వైద్యం గొప్పది : అమలా పాల్
దిశ, వెబ్ డెస్క్: హీరోయిన్ అమలాపాల్ పంచకర్మ చికిత్స ప్రాధాన్యతను వివరించింది. ఇది పూర్వీకులు అందించిన గొప్ప వరంగా అభివర్ణించిన ఆమె.. మనలో బెస్ట్ వెర్షన్‌ను బయటకు తీసుకొచ్చేందుకు.. శారీరకంగా, మానసికంగా ఉత్తమంగా మారేందుకు పంచకర్మ చాలా గొప్ప ప్రభావం చూపిస్తుందని తెలిపింది. వేగవంతమైన జీవితంలో పాశ్చాత్య ప్రభావం ఉన్న మనం చాలా అరుదుగా మన పూర్వీకుల సంపద విలువైనదని గుర్తిస్తామని చెప్పింది. సమాచారంతో కూడిన బంగారు గనిని మనకు వదిలి వెళ్లిపోయారని.. వాటిని ఆచరణలో పెట్టాలని […]
దిశ, వెబ్ డెస్క్: హీరోయిన్ అమలాపాల్ పంచకర్మ చికిత్స ప్రాధాన్యతను వివరించింది. ఇది పూర్వీకులు అందించిన గొప్ప వరంగా అభివర్ణించిన ఆమె.. మనలో బెస్ట్ వెర్షన్‌ను బయటకు తీసుకొచ్చేందుకు.. శారీరకంగా, మానసికంగా ఉత్తమంగా మారేందుకు పంచకర్మ చాలా గొప్ప ప్రభావం చూపిస్తుందని తెలిపింది. వేగవంతమైన జీవితంలో పాశ్చాత్య ప్రభావం ఉన్న మనం చాలా అరుదుగా మన పూర్వీకుల సంపద విలువైనదని గుర్తిస్తామని చెప్పింది. సమాచారంతో కూడిన బంగారు గనిని మనకు వదిలి వెళ్లిపోయారని.. వాటిని ఆచరణలో పెట్టాలని సూచించింది. పంచకర్మ చికిత్స ద్వారా పూర్తిగా పరివర్తన కలుగుతుందని.. ఇది ప్రక్షాళన, పునరుజ్జీవం యొక్క కథ అని తెలిపింది అమలాపాల్.
https://www.instagram.com/p/CFe1i9SjpEj/?utm_source=ig_web_copy_link
అయితే ఈ ప్రక్రియ ద్వారా వెళ్లేందుకు అపారమైన స్వీయ నియంత్రణ, బలం అవసరమని చెప్పింది. ఈ క్రమంలో మైండ్ సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నట్లు వెల్లడించింది. 28 రోజుల ప్రక్రియలో ఇప్పటికే 20 రోజులు పూర్తయినట్లు తెలిపిన అమలా పాల్.. మరి కొద్దిరోజుల్లో తనలో 180 డిగ్రీల పరివర్తనను చూపిస్తానని.. ఆ అనుభవాలు షేర్ చేసుకుంటానని అభిమానులకు చెప్పింది.