అష్ట దిగ్బంధనంలో గుంటూరు

ఏపీలోని గుంటూరులో కరోనా కోరలు చాచింది. పాజిటివ్ కేసుల సంఖ్య 50 దాటడంతో లాక్ డౌన్‌ను మరింత కఠిన తరం చేయనున్నారు. శనివారం వరకు ఉదయం ఆరు నుంచి 9 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు వెసులుబాటు కల్పించినా.. నేడు మార్కెట్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అసలు ఇళ్ల నుంచి ఎవరు బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా గుంటూరు పట్టణాన్ని దిగ్బంధించారు. కేవలం అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. సోమవారం నుంచి రోజు […]

Update: 2020-04-11 22:36 GMT

ఏపీలోని గుంటూరులో కరోనా కోరలు చాచింది. పాజిటివ్ కేసుల సంఖ్య 50 దాటడంతో లాక్ డౌన్‌ను మరింత కఠిన తరం చేయనున్నారు. శనివారం వరకు ఉదయం ఆరు నుంచి 9 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు వెసులుబాటు కల్పించినా.. నేడు మార్కెట్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అసలు ఇళ్ల నుంచి ఎవరు బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా గుంటూరు పట్టణాన్ని దిగ్బంధించారు. కేవలం అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు.

సోమవారం నుంచి రోజు విడిచి రోజు లాక్ డౌన్ ను అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిత్యావసరాల కోసం వచ్చే వారు ఖచ్చితంగా అడ్రస్ ప్రూఫ్ తీసుకొనిరావాలన్నారు. వారానికి ఒకసారి మాత్రమే నిత్యావసరాలను కొనుగోలు చేయాలని పోలీసులు సలహా ఇస్తున్నారు. ఉదయం నుంచి గుంటూరులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను అధికారులు మూసివేశారు. దీంతో బ్రాడీపేట, అరండల్ పేట ప్రాంతానికి, హిందూ కాలేజ్ సెంటర్‌కు మధ్య సంబంధాలు తెగిపోయాయి.

Tags: Guntur, Coronavirus, Lockdown, ap news, Covid-19

Tags:    

Similar News