ఆలీబాబా క్లౌడ్‌లో కొత్తగా 5000 నియామకాలు!
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ డిజిటల్ దిగ్గజ కంపెనీ ఆలీబాబా ఏప్రిల్ నెలలో డెటా సెంటర్లను స్థాపించనున్నట్టు వెల్లడించింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా పలు విభాగాల్లో సుమారు 5000 ఉద్యోగాలను నియమించనున్నట్టు ఆలీబాబా క్లౌడ్ ప్రకటించింది. సుమారు 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాబోయే 10 నెలల కాలంలో 5 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ నియామకాలు డేటాబేస్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, నెట్‌వర్క్, సర్వర్ విభాగాల్లో […]
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ డిజిటల్ దిగ్గజ కంపెనీ ఆలీబాబా ఏప్రిల్ నెలలో డెటా సెంటర్లను స్థాపించనున్నట్టు వెల్లడించింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా పలు విభాగాల్లో సుమారు 5000 ఉద్యోగాలను నియమించనున్నట్టు ఆలీబాబా క్లౌడ్ ప్రకటించింది. సుమారు 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాబోయే 10 నెలల కాలంలో 5 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ నియామకాలు డేటాబేస్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, నెట్‌వర్క్, సర్వర్ విభాగాల్లో చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది. ఇంతకుముందు వ్యాపారంలో మార్పులకు మూడు నుంచి ఐదేండ్ల కాలం పడితే ఇప్పుడు ఏడాదిలో మార్పులను చూడగలుగుతున్నామని ఆలీబాబా క్లౌడ్ ఇంటిలిజెన్స్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న జెఫ్ జాంగ్ స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా డిజిటల్ విభాగంలో అనేక మార్పులు వస్తున్న నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. విజన్ కంప్యూటింగ్, హ్యూమర్-మెషిన్ ఇంటరాక్షన్, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల్లో ప్రాథమికంగా పరిశోధనకు గతంలో ఆలీబాబా అకాడమిని స్థాపించింది. ఈ అకాడమీ నుంచి స్పీచ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇమేజ్ సెర్చ్ సహా వివిధ సాంకేతిక అంశాల్లో అభివృద్ధి సాధించారు. మొత్తం ఆలీబాబా క్లౌడ్ సేవలు 63 జోన్లలో ఉండగా, ఇండియాలో 2 జోన్లలో ఉన్నాయి.