వారి రుణం తీర్చుకోలేం: మీర్జాపూర్ హీరో
దిశ, వెబ్ డెస్క్: మీర్జాపూర్ సిరీస్ హీరో అలీ ఫజల్ కరోనా వారియర్స్‌పై ప్రశంసలు కురిపించారు. వారి ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతూ వస్తున్న డాక్టర్లకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ పిలుపు మేరకు రాజ్ భవన్‌లో జరిగిన కరోనా వారియర్స్ సన్మాన కార్యక్రమానికి హాజరైన అలీ ఫజల్.. ఇది తనకు చాలా చాలా స్పెషల్ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు ఎనిమిది నెలలుగా డాక్టర్లు కరోనా వైరస్‌తో […]
దిశ, వెబ్ డెస్క్: మీర్జాపూర్ సిరీస్ హీరో అలీ ఫజల్ కరోనా వారియర్స్‌పై ప్రశంసలు కురిపించారు. వారి ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతూ వస్తున్న డాక్టర్లకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ పిలుపు మేరకు రాజ్ భవన్‌లో జరిగిన కరోనా వారియర్స్ సన్మాన కార్యక్రమానికి హాజరైన అలీ ఫజల్.. ఇది తనకు చాలా చాలా స్పెషల్ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
దాదాపు ఎనిమిది నెలలుగా డాక్టర్లు కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తున్నారని, ప్రజలు కొవిడ్‌తో ఎఫెక్ట్ కాకుండా కాపాడుకుంటున్నారని అన్నారు. అలాంటి బ్రేవ్ వారియర్స్‌ను సన్మానించుకోవడం వారికి సాధ్యమైనంత తిరిగి ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు. కొన్నేళ్ల తర్వాత రాజ్‌భవన్‌కు తిరిగి రావడం ఆనందంగా ఉందన్న అలీ ఫజల్, ఈ ప్లేస్‌తో చాలా అనుబంధం ఉందని తెలిపారు. భమ్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా వారియర్స్ సత్కారం జరగడం గొప్ప విషయమని, లాక్ డౌన్‌లో ఆ సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలను అభినందించారు. కరోనా కాలంలో మన లైఫ్ స్టైల్‌ను సులభంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న డాక్టర్లు, పోలీసులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక అలీ ఫజల్ చివరగా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్న ‘మీర్జాపూర్ 2’ సిరీస్‌లో కనిపించారు.