బూట్లు మోసిన సర్ఫరాజ్.. పీసీబీపై అక్తర్ ఫైర్

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్, పాకిస్తాన్‌ల మధ్య బుధవారం నుంచి టెస్టు సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ రెండో రోజు ఆటలో భాగంగా పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ క్రీజులో ఉన్న తోటి క్రీడాకారుడు షాదాబ్‌కు బూట్లు, డ్రింక్స్ అందించాడు. దీనిపై మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘సర్ఫరాజ్‌ విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా’ అంటూ ఫైర్ అయ్యాడు. ‘సర్ఫరాజ్‌ 4 సంవత్సరాలపాటు జట్టుకు కెప్టెన్‌గా […]

Update: 2020-08-07 10:20 GMT

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్, పాకిస్తాన్‌ల మధ్య బుధవారం నుంచి టెస్టు సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ రెండో రోజు ఆటలో భాగంగా పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ క్రీజులో ఉన్న తోటి క్రీడాకారుడు షాదాబ్‌కు బూట్లు, డ్రింక్స్ అందించాడు. దీనిపై మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

‘సర్ఫరాజ్‌ విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా’ అంటూ ఫైర్ అయ్యాడు. ‘సర్ఫరాజ్‌ 4 సంవత్సరాలపాటు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. చాంపియన్స్ ట్రోఫీ వంటి టోర్నీలలో విజయం అందించాడు. అలాంటి సర్ఫరాజ్‌తో బూట్లు మోయించడం సరైన పద్ధతి కాదు. ఒకవేళ అతడే స్వయంగా ఆ పని చేయడానికి ముందుకొచ్చినా టీం మేనేజ్‌మెంట్ అడ్డు చెప్పి ఉండాల్సింది. నేను క్రికెట్ ఆడుతున్న సమయంలో వసీం అక్రమ్ ఎప్పుడూ నాకోసం షూస్ తీసుకురాలేదు. అలాంటప్పుడు సర్ఫరాజ్‌ ఎందుకు తీసుకొచ్చాడు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News