దేశీయంగా AK 203 గన్స్ తయారీ..
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ అవసరాల నిమిత్తం, మేకిన్ ఇండియాలో భాగంగా రానున్న రోజుల్లో సైన్యానికి మరింత బలం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రక్షణ రంగంలో కీలకంగా మారనున్న AK 203 తుపాకులను దేశీయంగా తయారు చేసేందుకు అడ్డంగులు తొలగిపోయాయి. ఈ మేరకు భారత్ తన రక్షణ భాగస్వామి అయిన రష్యాతో కీలక ఒప్పందం చేసుకున్నది. అందులో భాగంగానే ఇండో -రష్యా రైఫిల్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట సంస్థను ఏర్పాటు చేయనున్నది. దీని […]
దిశ, వెబ్‌డెస్క్ :
దేశీయ అవసరాల నిమిత్తం, మేకిన్ ఇండియాలో భాగంగా రానున్న రోజుల్లో సైన్యానికి మరింత బలం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రక్షణ రంగంలో కీలకంగా మారనున్న AK 203 తుపాకులను దేశీయంగా తయారు చేసేందుకు అడ్డంగులు తొలగిపోయాయి. ఈ మేరకు భారత్ తన రక్షణ భాగస్వామి అయిన రష్యాతో కీలక ఒప్పందం చేసుకున్నది.
అందులో భాగంగానే ఇండో -రష్యా రైఫిల్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట సంస్థను ఏర్పాటు చేయనున్నది. దీని తయారీ కేంద్రాన్ని ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఇప్పటికే నెలకొల్పింది. 2020 చివరి నాటికి అందులో తుపాకుల తయారీ ప్రారంభం అవుతుందని రక్షణ వర్గాలు తెలిపాయి. వీలైనంత త్వరగా 6 లక్షల AK 203 గన్స్ ఉత్పత్తి చేసి సైన్యానికి అందజేయాలని కేంద్రం నిర్ణయించింది.