నా కూతురికి కరోనా లేదు: అజయ్ దేవగన్

అజయ్ దేవగన్, కాజోల్ బాలీవుడ్ స్టార్ కపుల్. వీరికి ఇద్దరు పిల్లలు కాగా… 14 ఏళ్ల స్టార్ కిడ్ నిసా పై బాలీవుడ్ మీడియా ఎక్కువగానే అప్ డేట్స్ ఇస్తుంది. సింగపూర్ లో చదువుతున్న నిసా … కరోనా ఎఫెక్ట్ తో స్కూల్ మూతపడడంతో ఇండియాకి వచ్చేసింది. మార్చి 20న కాజోల్ స్వయంగా ఏర్ పోర్ట్ కి వెళ్లి రిసీవ్ చేసుకుంది. అయితే మార్చి 28న నిసాకు జ్వరం రావడంతో హాస్పిటల్ తీసుకెళ్ళింది కాజోల్. ఈ క్రమంలోనే […]

Update: 2020-03-31 05:27 GMT

అజయ్ దేవగన్, కాజోల్ బాలీవుడ్ స్టార్ కపుల్. వీరికి ఇద్దరు పిల్లలు కాగా… 14 ఏళ్ల స్టార్ కిడ్ నిసా పై బాలీవుడ్ మీడియా ఎక్కువగానే అప్ డేట్స్ ఇస్తుంది. సింగపూర్ లో చదువుతున్న నిసా … కరోనా ఎఫెక్ట్ తో స్కూల్ మూతపడడంతో ఇండియాకి వచ్చేసింది. మార్చి 20న కాజోల్ స్వయంగా ఏర్ పోర్ట్ కి వెళ్లి రిసీవ్ చేసుకుంది. అయితే మార్చి 28న నిసాకు జ్వరం రావడంతో హాస్పిటల్ తీసుకెళ్ళింది కాజోల్. ఈ క్రమంలోనే నిసాతో పాటు కాజోల్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు రూమర్లు వచ్చాయి.

అయితే ఈ వార్తలను ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చాడు అజయ్ దేవగన్. కాజోల్, నిసా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపాడు. వారి ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవన్నారు.

ఇక కూతురితో లాక్ డౌన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది కాజోల్. ఇద్దరి పిక్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.


Tags: Ajay devagan, kajol, nysa, CoronaVirus, Covid19

Tags:    

Similar News