ఎయిర్‌పోర్టులో చంద్రబాబు… సీన్ రివర్స్
దిశ, వెబ్ డెస్క్: రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. నాడు ప్రతిపక్షంలో ఉన్నవారు నేడు అధికారంలో ఉండొచ్చు.. నేడు అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలో ఉండొచ్చు. దీనికి సరిగ్గా సూటయ్యే సామెత చెప్పాలంటే ఓడలు బళ్లు అవుతాయి.. బళ్లు ఓడలు అవుతాయన్నమాట. ఇవి ప్రస్తుత సీఎం వైఎస్ జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విషయంలో నిజమని నిరూపితమవుతున్నాయి. 2017లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత జగన్ ను ఎయిర్ పోర్ట్ లో […]
దిశ, వెబ్ డెస్క్: రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. నాడు ప్రతిపక్షంలో ఉన్నవారు నేడు అధికారంలో ఉండొచ్చు.. నేడు అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలో ఉండొచ్చు. దీనికి సరిగ్గా సూటయ్యే సామెత చెప్పాలంటే ఓడలు బళ్లు అవుతాయి.. బళ్లు ఓడలు అవుతాయన్నమాట. ఇవి ప్రస్తుత సీఎం వైఎస్ జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విషయంలో నిజమని నిరూపితమవుతున్నాయి. 2017లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత జగన్ ను ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అడ్డుకుంటే నేడు సీన్ కాస్త రివర్స్ అయ్యింది. జగన్ హయాంలో చంద్రబాబును రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామాలు రాజకీయాల్లో చాలా ఆసక్తికరంగా మారాయి. ఏపీలో పొలిటికల్ హీట్ రేపుతున్న ఈ వ్యహారంపై ప్రత్యేక కథనం ఓసారి చూద్దాం.
2017 జనవరి 26:
2017లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా.. ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నారు. అయితే జనవరి 26వ తేదీన రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ విశాఖ బీచ్ రోడ్డులో క్యాండిల్ ర్యాలీకి సీఎం జగన్ బయలుదేరారు. జగన్ పర్యటనకు అనుమతి లేదంటూ.. ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబులు ఉన్నారు. వారిని బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎయిర్ పోర్ట్ లోనే జగన్ నిరసనకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది.
2021 మార్చి 1:
2021 మార్చి 01వ తేదీ సోమవారం చిత్తూరు జిల్లాలో నిరసన కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన్ను పోలీసు ఉన్నతాధికారులు అడ్డుకున్నారు. పర్యటనకు అనుమతి లేదంటూ.. వీఐపీ లాంజ్ లో నిర్భందించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు.
మెుత్తానికి నాడు చంద్రబాబు హయాంలో వైఎస్ జగన్ ను విశాఖ ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అడ్డుకుంటే… నేడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు అదే తరహాలో ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబును అడ్డుకోవడం ఆసక్తికరంగా మారింది. వైసీపీ అభిమానులు, కార్యకర్తలు అయితే నాడు జగన్ ని అడ్డుకున్న ఫోటోను.. ఇప్పుడు చంద్రబాబును అడ్డుకున్న ఫోటోను జత చేసి చంద్రబాబు నాయుడుపైనా తెలుగుదేశం పార్టీపైనా విమర్శలు గుప్పిస్తున్నారు.