ఎయిర్‌బస్ విమానాలను కొనే ఆలోచనలో 'ఆకాశ'

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పలువురు పెట్టుబడిదారులతో కలిసి ప్రారంభించబోయే విమానయాన సంస్థతో చర్చలు జరుపుతున్నట్టు ప్రముఖ ఎయిర్‌బస్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఎయిర్‌బస్ తయారు చేస్తున్న ఏ320 విమానాలను కొనేందుకు ‘ఆకాశ’ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో విమానాల కొనుగోలుకు సంబంధించి ‘ఆకాశ’ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్టు ఎయిర్‌బస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్(సీఓఓ) క్రిస్టియన్ చెప్పారు. బోయింగ్ బీ737 మ్యాక్స్ విమానాలను కొనేందుకు ఆకాశ సంస్థ ఆసక్తిగా ఉన్నట్టు […]

Update: 2021-10-10 10:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పలువురు పెట్టుబడిదారులతో కలిసి ప్రారంభించబోయే విమానయాన సంస్థతో చర్చలు జరుపుతున్నట్టు ప్రముఖ ఎయిర్‌బస్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఎయిర్‌బస్ తయారు చేస్తున్న ఏ320 విమానాలను కొనేందుకు ‘ఆకాశ’ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో విమానాల కొనుగోలుకు సంబంధించి ‘ఆకాశ’ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్టు ఎయిర్‌బస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్(సీఓఓ) క్రిస్టియన్ చెప్పారు. బోయింగ్ బీ737 మ్యాక్స్ విమానాలను కొనేందుకు ఆకాశ సంస్థ ఆసక్తిగా ఉన్నట్టు గతంలోనూ సంకేతాలు వినిపించాయి. తాజాగా దీనిపై స్పందించిన క్రిస్టియన్ చర్చలకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించలేదు. కానీ, భారత్‌లో కొత్త విమానయాన సంస్థ ఇప్పటికే ఉన్న కంపెనీలతో పోటీ పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో మెరుగైన కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇండిగో స్థాయిలోనే ఆకాశ కూడా ప్రయత్నాలు జరగవచ్చు. ఇండిగో వద్ద ఎయిర్‌బస్‌కే చెందిన ఏ320, ఏ321 విమానాలు ఉన్నాయి. దేశీయంగా విమాన సేవలకు సంబంధించి ఇండిగో 50 శాతం వాటాను కలిగి ఉంది. అలాగే, పూర్తిగా ఎయిర్‌బస్ తయారీ న్యారో బాడీ విమానాలను ఉపయోగిస్తోంది. ఈ తరహా విమానాలను దేశీయ ఇతర సంస్థలు ఎయిర్ఇండియా, స్పైస్‌జెట్ సంస్థలు వినియోగిస్తున్నాయి.

Tags:    

Similar News