అహోబిలం ఆలయ అర్చకుడికి కరోనా

దిశ ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా స్వైర విహారం చేస్తోంది. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అర్చకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం పుణ్యక్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మూడు నెలల పాటు ఆలయాన్ని మూసి ఉంచిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో తిరిగి ఆలయాన్ని తెరిచారు. ఈ క్రమంలో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కవకావడంతో […]

Update: 2020-06-22 00:18 GMT

దిశ ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా స్వైర విహారం చేస్తోంది. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అర్చకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం పుణ్యక్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మూడు నెలల పాటు ఆలయాన్ని మూసి ఉంచిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో తిరిగి ఆలయాన్ని తెరిచారు. ఈ క్రమంలో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కవకావడంతో వైరస్ అర్చుకుడికి సోకింది. దీంతో ఆలయ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు. దేవాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేయనున్నారు.

Tags:    

Similar News