తెలంగాణ హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: తెలంగాణ హైకోర్టులో మంగళవారం అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేసును అమరావతి హైకోర్టుకు బదిలీ చేయాలని కోరగా.. పరిపాలనా పరమైన ఆదేశాలు ఇచ్చే అధికారం ప్రధాన న్యాయమేర్తికి మాత్రమే ఉంటుందని జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్‌ల బెంచ్ తెలిపింది. బ్యాంక్‌లతో వన్ టైం సెటిల్మెంట్‌కు అవకాశం కల్పించాలని యాజమాన్యం పిటిషన్ దాఖలు చేయగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం […]
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: తెలంగాణ హైకోర్టులో మంగళవారం అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేసును అమరావతి హైకోర్టుకు బదిలీ చేయాలని కోరగా.. పరిపాలనా పరమైన ఆదేశాలు ఇచ్చే అధికారం ప్రధాన న్యాయమేర్తికి మాత్రమే ఉంటుందని జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్‌ల బెంచ్ తెలిపింది. బ్యాంక్‌లతో వన్ టైం సెటిల్మెంట్‌కు అవకాశం కల్పించాలని యాజమాన్యం పిటిషన్ దాఖలు చేయగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం చేసిన తాజా దరఖాస్తుపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ, ఈడీ, బ్యాంకులు పిటిషనర్ ఆండాళ్ రమేష్‌బాబులకు రిప్లై అఫిడవిట్‌లను దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది.