బాసరలో "అగ్రి" సెజ్..!

దిశ, ఆదిలాబాద్: సరస్వతి పుణ్యక్షేత్రం బాసరలో వ్యవసాయ ఆధారిత సెజ్ రాబోతున్నదా..? అంటే అవును అనే సంకేతాలు వెలువడుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే బాసరలో అగ్రి సెజ్ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోన్నది. ఇప్పటికే శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ లో అక్రమంగా భూములను అనుభవిస్తున్న వాటి సమాచారాన్ని కూడా ప్రభుత్వం నివేదిక కోరినట్లు […]

Update: 2020-05-22 10:56 GMT

దిశ, ఆదిలాబాద్: సరస్వతి పుణ్యక్షేత్రం బాసరలో వ్యవసాయ ఆధారిత సెజ్ రాబోతున్నదా..? అంటే అవును అనే సంకేతాలు వెలువడుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే బాసరలో అగ్రి సెజ్ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోన్నది. ఇప్పటికే శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ లో అక్రమంగా భూములను అనుభవిస్తున్న వాటి సమాచారాన్ని కూడా ప్రభుత్వం నివేదిక కోరినట్లు తెలిసింది. ఈ భూములతో పాటు మరి కొన్ని భూములను గుర్తించి వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తొమ్మిది మంది ల్యాండ్ సర్వే అధికారులు సోమవారం నుంచి సర్వే నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

Tags:    

Similar News