జీవో నెంబర్ 317 ను రద్దు చేయండి : ఎం.ధర్మ నాయక్

దిశ, అచ్చంపేట : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను ఇతర జిల్లాలకు బదిలీ చేయడం, స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధర్మ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐదవ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతంలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చెబుతున్న, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా గిరిజన ఉపాధ్యాయుల మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని ఆయన విమర్శించారు. ఇప్పటికే స్థానికంగా ఉంటూ తమ […]

Update: 2021-12-26 04:57 GMT

దిశ, అచ్చంపేట : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను ఇతర జిల్లాలకు బదిలీ చేయడం, స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధర్మ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐదవ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతంలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చెబుతున్న, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా గిరిజన ఉపాధ్యాయుల మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని ఆయన విమర్శించారు.

ఇప్పటికే స్థానికంగా ఉంటూ తమ తల్లిదండ్రులను తమ కుటుంబాన్ని చూసుకుంటున్నారని, ఇతర జిల్లాలకు బదిలీ కావడంతో ఇబ్బంది పడుతున్నామని, ఏజెన్సీ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఎద్దేవా చేశారు. తక్షణమే 317 జీవోను రద్దు చేయాలని, స్థానికంగా ఉద్యోగ భర్తీ చేయాలని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసిందిని, 80 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాట ఉపాధ్యాయులకు వర్తించదా, ఇలా ఎందుకు ఏజెన్సీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఇతర జిల్లాలకు బదిలీ చేసే ఆలోచనను విరమించుకుని స్థానికంగా ఉన్నటువంటి ఏజెన్సీ హక్కులను కాపాడాలని లేనిచో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు.

Tags:    

Similar News