ఖమ్మంలో క‌ల్తీ మ‌ద్యం ప‌ట్టివేత‌

దిశ‌, ఖ‌మ్మం టౌన్ : ఖ‌మ్మం పట్టణంలో కల్తీ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కల్లీ మద్యం రవాణా చేస్తున్న పేరాల శ్రీను అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ వీ సోమిరెడ్డి వివరాలను వెల్లడించారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం…పట్టణంలోని రాప‌ర్తిన‌గ‌ర్ హ‌నుమాన్ టెంపుల్ వ‌ద్ద పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో మారుతీ నగర్‌కు చెందిన పేరాల శ్రీను అలియాస్ ఆనంద్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం పై వరంగల్ నుంచి […]

Update: 2020-12-02 10:51 GMT

దిశ‌, ఖ‌మ్మం టౌన్ : ఖ‌మ్మం పట్టణంలో కల్తీ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కల్లీ మద్యం రవాణా చేస్తున్న పేరాల శ్రీను అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ వీ సోమిరెడ్డి వివరాలను వెల్లడించారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం…పట్టణంలోని రాప‌ర్తిన‌గ‌ర్ హ‌నుమాన్ టెంపుల్ వ‌ద్ద పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో మారుతీ నగర్‌కు చెందిన పేరాల శ్రీను అలియాస్ ఆనంద్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం పై వరంగల్ నుంచి కల్తీ మద్యం రవాణా చేస్తున్నట్టు గుర్తించి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతని దగ్గర నుంచి 5 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారించి అతని ఇంటి వద్ద పోలీసులు తనిఖీలు చేయగా 60 కల్తీ మద్యం బాటిళ్లు దొరికాయి. కాగా వాటి విలువ సుమారు రూ. ల‌క్ష ఉంటుందని తెలిపారు. ఇలాంటి నేరాల‌కు ఎవ‌రైన పాల్ప‌డుతున్న‌ట్లు తెలిస్తే సెల్ నెం. 9440902669కు లేదా ఖ‌మ్మం – 1 టౌన్ సీఐ నెం. 9440902671కుగాని స‌మాచారం అందించాలని ప్ర‌జ‌ల‌ను కోరారు.

Tags:    

Similar News