ఇకమీదట ఆదిలాబాద్ రిమ్స్‌‌లో కరోనా టెస్టులు

దిశ, ఆదిలాబాద్ : తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో లాక్‌డౌన్ ఎత్తివేస్తే ఎవరి పనులు వారు చేసుకోవచ్చని అంతా భావించారు. కానీ వారి ఆశలు ఆడియాశలు చేస్తూ తిరిగి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టీఆర్‌ఎస్ సర్కార్ వెంటనే అప్రమత్తమైంది. ప్రస్తుతం మన వద్ద టెస్టింగ్ కేంద్రాలు తక్కువగా ఉండటం, పరీక్షలు తక్కువగా చేస్తున్నారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతుండటంతో ప్రభుత్వం దీనిపై దృష్టిసారించింది. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని […]

Update: 2020-05-12 09:19 GMT

దిశ, ఆదిలాబాద్ : తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో లాక్‌డౌన్ ఎత్తివేస్తే ఎవరి పనులు వారు చేసుకోవచ్చని అంతా భావించారు. కానీ వారి ఆశలు ఆడియాశలు చేస్తూ తిరిగి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టీఆర్‌ఎస్ సర్కార్ వెంటనే అప్రమత్తమైంది. ప్రస్తుతం మన వద్ద టెస్టింగ్ కేంద్రాలు తక్కువగా ఉండటం, పరీక్షలు తక్కువగా చేస్తున్నారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతుండటంతో ప్రభుత్వం దీనిపై దృష్టిసారించింది. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు మంగళవారం అనుమతులు మంజూరు చేసింది. కరోనా నివారణకు స్వాబ్ పరీక్షలు అనివార్యమవుతున్న నేపథ్యంలో రిమ్స్ డైరెక్టర్‌‌కు ప్రభుత్వం నుంచి ఉత్తర్వు లు అందినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు త్వరలోనే పరీక్షలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రిమ్స్ డైరక్టర్ వివరించారు.

Tags:    

Similar News