ఆదిలాబాద్: తాటిగూడలో భారీ బందోబస్తు
దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ తాటిగూడ కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో తాటిగూడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలను మోహరింపజేసి 24 గంటల పాటు గస్తీ కొనసాగిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన మహమ్మద్ జమీర్, మోహత సిమ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు సమాచారం. వారికి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేగాకుండా జమీర్ శరీరంలో మూడు బుల్లెట్లు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. […]
దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ తాటిగూడ కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో తాటిగూడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలను మోహరింపజేసి 24 గంటల పాటు గస్తీ కొనసాగిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన మహమ్మద్ జమీర్, మోహత సిమ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు సమాచారం. వారికి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేగాకుండా జమీర్ శరీరంలో మూడు బుల్లెట్లు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి రెండు తూటాలను తొలగించారు. మోహత సిమ్ నడుము భాగంలో ఉన్న ఒక తూటాను తొలగించారు. ప్రస్తుతం ఇరువురు చికిత్సకు సహకరిస్తున్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.