కోహ్లీపై ఆ బౌలర్‌కు రికార్డు
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌తో పుణె వేదికగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ, రిషబ్ పంత్ భారీ ఇన్నింగ్స్‌తో విజృంభించినా.. బౌలింగ్ డిపార్ట్‌మెంట్ మాత్రం చతికిలపడిపోయింది. భువనేశ్వర్ కుమార్ మినహా టీమిండియా మిగతా బౌలర్లు ఇంగ్లీష్ బ్యాట్‌మెన్ల దెబ్బకు చిత్తయ్యారు. చివరిలో ప్రసిద్ధ్ వికెట్లు తీసినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 66 పరుగులు చేసి మరోసారి ఇంగ్లండ్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌తో పుణె వేదికగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ, రిషబ్ పంత్ భారీ ఇన్నింగ్స్‌తో విజృంభించినా.. బౌలింగ్ డిపార్ట్‌మెంట్ మాత్రం చతికిలపడిపోయింది. భువనేశ్వర్ కుమార్ మినహా టీమిండియా మిగతా బౌలర్లు ఇంగ్లీష్ బ్యాట్‌మెన్ల దెబ్బకు చిత్తయ్యారు. చివరిలో ప్రసిద్ధ్ వికెట్లు తీసినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 66 పరుగులు చేసి మరోసారి ఇంగ్లండ్ స్పిన్నర్ రషీద్‌కు ఔటయ్యాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రషీద్‌కి కోహ్లీ ఔటవ్వడం ఇది తొమ్మిదోసారి. దీనికి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన 5 వన్డేల టీ20 సిరీస్‌లో రషీద్ బౌలింగ్‌లో కోహ్లీ రెండుసార్లు ఔటయ్యాడు.
ఇప్పటివరకు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టీమ్ సౌతీకి కోహ్లీ 10 సార్లు ఔటయ్యాడు. ఆ తర్వాత ఎక్కువసార్లు ఔట్ అయింది రషీద్ బౌలింగ్‌లోనే. ఇక ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్, మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ బౌలింగ్‌లో కోహ్లీ 8 సార్లు ఔటయ్యాడు. స్పిన్నర్లకు కోహ్లీ ఎక్కువసార్లు ఔటవ్వడం గమనార్హం.