అకస్మికంగా వెంచర్లను పరిశీలించిన అదనపు కలెక్టర్

దిశ, ఖమ్మం రూరల్​ : రూరల్​ మండల పరిధిలో గల అనధికార వెంచర్ల వివరాలు సేకరించాలని సుడా, గ్రామ పంచాయతీ పెద్దతండా అధికారులను అదనపు కలెక్టర్ స్నేహలత (లోకల్ బాడీస్) ఆదేశించారు. గురువారం రూరల్​ మండలం పెద్దతండా పంచాయతీ నందు నిర్మాణములో వున్న స్మశాన వాటిక, వైకుంటధామాలను, వెంచర్​లను ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా వెంచర్​లు నిర్మిస్తున్న వివరాలను వెంటనే రిపోర్టు ఇవ్వాలన్నారు. అనంతరం పెద్దతండాలో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. ఈ […]

Update: 2021-09-30 07:06 GMT

దిశ, ఖమ్మం రూరల్​ : రూరల్​ మండల పరిధిలో గల అనధికార వెంచర్ల వివరాలు సేకరించాలని సుడా, గ్రామ పంచాయతీ పెద్దతండా అధికారులను అదనపు కలెక్టర్ స్నేహలత (లోకల్ బాడీస్) ఆదేశించారు. గురువారం రూరల్​ మండలం పెద్దతండా పంచాయతీ నందు నిర్మాణములో వున్న స్మశాన వాటిక, వైకుంటధామాలను, వెంచర్​లను ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా వెంచర్​లు నిర్మిస్తున్న వివరాలను వెంటనే రిపోర్టు ఇవ్వాలన్నారు. అనంతరం పెద్దతండాలో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు.

ఈ నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమములో జిల్లా పంచాయతీ అధికారి వాసిరెడ్డి ప్రబాకర్ రావు, డీఎల్​పీవో పుల్లారావు , పీఆర్​ ఈఈ చంద్రమౌళీ పీఆర్​ డీఈ సత్యనారయణ రెడ్డి ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీవో శ్రీనివాసరావు, పీఆర్​ ఏఈ రామం, స్పేషల్​ అఫీసర్​ వేణుమాదవ్, కార్యదర్శి. ఏపీవో శ్రీదేవి తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News