వర్మ.. ఇదేం పని : పూనమ్

ఆర్జీవీ.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లున్నాడు. పవర్‌స్టార్ టైటిల్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన వర్మ.. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్‌ను ట్వీట్ల రూపంలో తిట్టిపోస్తున్న హీరోయిన్ పూనమ్ కౌర్‌కు కాల్ చేసినట్లు ఉన్నాడు. వారి తప్పొప్పులు తెలుసుకోవాలని ఆశించాడో ఏమో.. అసలు బ్యాక్ గ్రౌండ్‌లో ఏం జరిగిందో తెలియదు కానీ సినిమా గురించి ఆర్జీవీ ప్రకటించగానే.. వర్మను గట్టిగానే వేసుకుంది పూనమ్. నీలాంటి వ్యక్తిని నా జన్మలో […]

Update: 2020-06-28 05:32 GMT

ఆర్జీవీ.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లున్నాడు. పవర్‌స్టార్ టైటిల్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన వర్మ.. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్‌ను ట్వీట్ల రూపంలో తిట్టిపోస్తున్న హీరోయిన్ పూనమ్ కౌర్‌కు కాల్ చేసినట్లు ఉన్నాడు. వారి తప్పొప్పులు తెలుసుకోవాలని ఆశించాడో ఏమో.. అసలు బ్యాక్ గ్రౌండ్‌లో ఏం జరిగిందో తెలియదు కానీ సినిమా గురించి ఆర్జీవీ ప్రకటించగానే.. వర్మను గట్టిగానే వేసుకుంది పూనమ్. నీలాంటి వ్యక్తిని నా జన్మలో చూసి ఉండనని చెప్పింది. ‘అమ్మాయిలకు ఫోన్ చేసి బ్రెయిన్ వాష్ చేయడం.. ఫలానా వ్యక్తి చెడ్డవాడు అని ట్వీట్స్ చేయడం.. తర్వాత మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వమనడం మీకే చెల్లుతుందేమో’ అని మండిపడింది.

‘పవర్‌స్టార్ సినిమాలో ఆర్జీవీ అనే క్యారెక్టర్‌ను యాడ్ చేసి ఇలా చేశాడని పెట్టండి. మీ మీద చిన్నప్పుడు చాలా గౌరవం ఉండేది.. కానీ మీరు చేసిన ఈ పనికి మిమ్మల్ని చూస్తే బాధగా ఉంది’ అని చెప్పింది.

Tags:    

Similar News