కరోనా పాజిటివ్.. డాక్టర్లు డెలివరీ చేయమని చెప్పారు- నటి హరితేజ

దిశ, వెబ్ డెస్క్: కరోనాతో దేశం అతలాకుతలం అవుతోంది. సొంత వాళ్ళు సైతం కరోనా అనగానే దూరమవుతున్నారు. తన, మన.. తల్లి, చెల్లి లాంటి బంధాలు కరోనా సమయంలో మాత్రం కుదరదు అని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. సామాన్యులే కాదు సెలెబ్రెటీలు సైతం ఇలాంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇలాంటి దుస్థితినే తానూ ఎదుర్కొన్నానని నటి హరితేజ తెలిపింది. కరోనా సమయంలో గర్భవతిగా ఉన్న తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. అలాంటి సమయంలో తానొక్కదాన్నే ఒంటరిగా పోరాడానని […]

Update: 2021-04-29 01:27 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనాతో దేశం అతలాకుతలం అవుతోంది. సొంత వాళ్ళు సైతం కరోనా అనగానే దూరమవుతున్నారు. తన, మన.. తల్లి, చెల్లి లాంటి బంధాలు కరోనా సమయంలో మాత్రం కుదరదు అని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. సామాన్యులే కాదు సెలెబ్రెటీలు సైతం ఇలాంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇలాంటి దుస్థితినే తానూ ఎదుర్కొన్నానని నటి హరితేజ తెలిపింది. కరోనా సమయంలో గర్భవతిగా ఉన్న తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. అలాంటి సమయంలో తానొక్కదాన్నే ఒంటరిగా పోరాడానని కన్నీటిపర్యంతమయ్యింది. ఆ సమయంలో తాను అనుభవించిన బాధను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. డెలివరీ సమయంలో తాను పడిన కష్టాలను వివరిస్తూ ఓ సుదీర్ఘమైన వీడియోని పోస్ట్‌ చేసింది.

“పాప పుట్టాక శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థాంక్స్.. పాప పుట్టడానికి వారం ముందు నేను, నా కుటుంబ సభ్యులందరు కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో నా భర్త ఒక్కడే నాకు తోడుగా ఉన్నాడు. కరోనా అని తెలిసాక డాక్టర్లు నాకు డెలివరీ చేయమన్నారు. ప్రతిరోజు టెస్టులు, రిపోర్ట్స్ అంటూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఒంటరిగా నేనే డెలివరీ కి వెళ్లాను. నాతో పాటు పాప కి కూడా కరోనా వస్తుందేమోనని చాలా భయపడ్డాను. ఆ వారం రోజులు నరకాన్ని చూశాను. కోవిడ్ వార్డులో నా భర్త దీపు తప్ప నా వాళ్లు ఎవరు లేరు. నేను పడ్డ కష్టం ఎవరు పడకూడదు.. డెలివరీ మహిళలు చాలా జాగ్రత్తగా ఉండండి.. బయట పరిస్థితులు బాలేదు. అందరు జాగ్రత్తగా ఉండండి” అంటూ విజ్ఞప్తి చేసింది.

Tags:    

Similar News