ప్రకాష్ రాజ్ చేతికి గాయం.. ఎవరికి బాధ లేదంటూ నెటిజన్ ట్వీట్

దిశ, వెబ్‌డెస్క్: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చేతికి స్వల్ప గాయం అయింది. చేతికి ఫ్రాక్షర్ కావడంతో చికిత్స నిమిత్తం చెన్నై నుంచి హైదరాబాద్ బయల్దేరినట్టు ఆయన ట్వీట్ చేశారు. ‘నా స్నేహితుడు డాక్టర్ గురువా రెడ్డి పర్యవేక్షణలో శస్త్ర చికిత్స తీసుకోవడానికే హైదరాబాద్‌ వెళ్తున్నాను. నేను బాగానే ఉంటాను.. డోంట్ వర్రీ.. నన్ను మీ ఆలోచనల్లో ఉంచుకోండి’ అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్‌ చూసిన ఆయన అభిమానులు త్వరలో కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. […]

Update: 2021-08-10 04:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చేతికి స్వల్ప గాయం అయింది. చేతికి ఫ్రాక్షర్ కావడంతో చికిత్స నిమిత్తం చెన్నై నుంచి హైదరాబాద్ బయల్దేరినట్టు ఆయన ట్వీట్ చేశారు. ‘నా స్నేహితుడు డాక్టర్ గురువా రెడ్డి పర్యవేక్షణలో శస్త్ర చికిత్స తీసుకోవడానికే హైదరాబాద్‌ వెళ్తున్నాను. నేను బాగానే ఉంటాను.. డోంట్ వర్రీ.. నన్ను మీ ఆలోచనల్లో ఉంచుకోండి’ అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్‌ చూసిన ఆయన అభిమానులు త్వరలో కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అయితే నీ చేతికి గాయం అయితే ఇక్కడ ఎవరు కూడా చింతించడం లేదంటూ నెగెటివ్ మేసేజ్‌లు ఇవ్వడం గమనార్హం.

Tags:    

Similar News