ఒక్క ట్వీట్‌తో బ్రహ్మాజీ అకౌంటే పోయింది!
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల వలన వరదలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందులో టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని వరదలపై బ్రహ్మాజీ వేసిన సెటైర్ హాట్ టాపిక్‌గా మారింది. ఆయన చేసిన ట్వీటే చివరి ట్వీట్‌గా మారింది. దానిపై వచ్చిన కామెంట్స్ వలన చివరికి బ్రహ్మాజీ ట్విట్టర్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కొన్ని రోజుల కిందట బ్రహ్మాజీ […]
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల వలన వరదలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందులో టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని వరదలపై బ్రహ్మాజీ వేసిన సెటైర్ హాట్ టాపిక్‌గా మారింది. ఆయన చేసిన ట్వీటే చివరి ట్వీట్‌గా మారింది. దానిపై వచ్చిన కామెంట్స్ వలన చివరికి బ్రహ్మాజీ ట్విట్టర్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
కొన్ని రోజుల కిందట బ్రహ్మాజీ హైదరాబాద్ వరదలపై సెటైర్ వేసాడు. “ఓ మోటార్ బోటు కొనాలని అనుకుంటున్నాను. దయచేసి ఓ మంచి బోటు గురించి చెప్పండి ప్లీజ్” అని ట్వీట్ చేసాడు. తన ఇంటి చుట్టూ ఉన్న వరద నీరు ఫోటోలను పోస్ట్ చేసాడు. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు ఆయనకు సూచనలు చేస్తుంటే.. మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఆయన ట్వీట్ వైరల్ కావడం.. బ్రహ్మాజీపై ఎక్కువగా విమర్శలు రావడంతో తన ట్విట్టర్ ఖాతాను బ్రహ్మాజీ తొలగించుకున్నాడు. ఇదిలాఉండగా, హైదరాబాద్ వరదలపై సోషల్ మీడియాలో నెటిజన్లు రోజుకో సెటైర్ వేస్తున్నారు. కొందరు ఓలా, ఉబర్ యాపుల్లో బోటు సర్వీస్ అవకాశం ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు.