జైలుకు తరలిస్తుండగా ఖైదీ పరారీ
దిశ వెబ్ డెస్క్: జైలుకు తరలిస్తుండగా ఖైదీ పారిపోయిన ఘటన యూపీలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లో కెళితే…లఖీంపూర్ ఖేరీలోని మితౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై హీరాలాల్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా ఆ కేసులో ఆ నిందితున్ని బైక్ పై ఇద్దరు కానిస్టేబుల్స్ జైలుకు తరలిస్తున్నారు. కాగా బైక్ లో పెట్రోల్ పోయించేందుకు ఓ బంక్ వద్ద పోలీసులు బైక్ ను ఆపారు. దీంతో అదును చూసి నిందితుడు […]
దిశ వెబ్ డెస్క్: జైలుకు తరలిస్తుండగా ఖైదీ పారిపోయిన ఘటన యూపీలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లో కెళితే…లఖీంపూర్ ఖేరీలోని మితౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై హీరాలాల్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా ఆ కేసులో ఆ నిందితున్ని బైక్ పై ఇద్దరు కానిస్టేబుల్స్ జైలుకు తరలిస్తున్నారు. కాగా బైక్ లో పెట్రోల్ పోయించేందుకు ఓ బంక్ వద్ద పోలీసులు బైక్ ను ఆపారు. దీంతో అదును చూసి నిందితుడు పారిపోయాడు. కాగా నిందితుడిని పోలీసులు కొంత దూరం వెంబడించారు. కానీ అతన్ని పట్టుకోలేక పోయారు.
అయితే ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు జరిపారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా చివరికి నిందితున్ని పోలీసులు పట్టుకోగలిగారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్స్ పై చర్యలకు అధికారులు ఆదేశించారు.
Read Also..