నిర్మల్‌లో ఏసీబీ రైడ్స్.. రెడ్‌‌ హ్యాండెడ్‌గా దొరికిన అధికారి

దిశ, నిర్మల్ రూరల్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మెడికల్ రియింబర్స్‌మెంట్ కోసం రిటైర్డ్ ఐఎస్‌ఎస్ఓ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా.. రూ. 8 వేలు లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ అడ్డంగా దొరికాడు. దీంతో సీనియర్ అసిస్టెంట్ ఆఫీసులోనూ తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ బద్రి మాట్లాడుతూ.. రిటైర్డ్ ఐ‌ఎఫ్‌ఎస్‌ఓ అధికారి ఫిర్యాదు […]

Update: 2021-08-05 11:44 GMT

దిశ, నిర్మల్ రూరల్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మెడికల్ రియింబర్స్‌మెంట్ కోసం రిటైర్డ్ ఐఎస్‌ఎస్ఓ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా.. రూ. 8 వేలు లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ అడ్డంగా దొరికాడు. దీంతో సీనియర్ అసిస్టెంట్ ఆఫీసులోనూ తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ బద్రి మాట్లాడుతూ.. రిటైర్డ్ ఐ‌ఎఫ్‌ఎస్‌ఓ అధికారి ఫిర్యాదు మేరకు జిల్లా వైద్య అధికారి కార్యాలయంలో దాడులు నిర్వహించగా.. ఎనిమిది వేల రూపాయలు మాత్రమే దొరికాయని స్పష్టం చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామన్నారు.

Tags:    

Similar News